రేవంత్ కు తొలి ఝలక్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ రేవంత్ కు ఆహ్వాన లేఖ పంపిన రమణ ఆహ్వాన లేఖ చూసి నివ్వెర పోయిన రేవంత్ క్షణ క్షణం ఉత్కంఠ రేపుతున్న టిడిపి పరిణామాలు
టిడిపిలో జరుగుతున్న పరిణామాలు క్షణం క్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. కొద్ది సేపటి క్రితమే రెబల్ రేవంత్ రెడ్డికి టిడిపి తెలంగాణ శాఖ అధ్యక్షులు ఎల్. రమణ తొలి షాక్ ఇచ్చారు. రేపు టిడిఎల్పీ సమావేశం లేదని ప్రకటించిన రమణ వెనువెంటనే మరో చర్యకు దిగారు.
రేపు గోల్కొండ హోటల్ లో జరగనున్న టిడిపి, బిజెపి నేతల సమావేశానికి హాజరుకావాలంటూ రెబల్ రేవంత్ రెడ్డికి పార్టీ తెలంగాణ అధ్యక్షులైన రమణ ఆహ్వానం పంపారు. ఇందులో తప్పేముంది? ఆయన పార్టీ అధ్యక్షుడే కదా అని మీరనుకోవచ్చు. కానీ అసలు కథ వేరే ఉంది.
ఈ ఆహ్వాన పత్రంలో రేవంత్ రెడ్డిని సాధారణ టిడిపి ఎమ్మెల్యే హోదాతోనే పంపారు. అంటే టిడిఎల్పీ నేతగా ఉన్న పదవిని పక్కన పెట్టి ఉత్త ఎమ్మెల్యేగా గుర్తిస్తూ లేఖ పంపారు రమణ.
అయితే ఎమ్మెల్యే హోదాలో ఆహ్వాన పత్రం అందడంతో దానికి రేవంత్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈరోజు సాయంత్రం నాటికే తెలంగాణ స్పీకర్ కు రేవంత్ రెడ్డిని పార్టీ శాసనసభా పక్ష నేతగా తొలగిస్తున్న విషయాన్ని పార్టీ అధిష్టానం లేఖ రాసే అవకాశాలున్నట్లు పార్టీ నేతల్లో చర్చ జరుగుతున్నది.
మరోవైపు విదేశాల్లో ఉన్న చంద్రబాబు టీ టీడీపీలో జరుగుతున్న పరిణామాలపై కాసేపటి క్రితం ఎల్. రమణతో విదేశాల నుంచి ఫోన్లో సమీక్షించారు. పార్టీ కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తున్నారు. అదే విధంగా ముందుకు కొనసాగాలని రమణకు దిశా నిర్దేశం చేశారు బాబు.
మొత్తానికి రేవంత్ రెడ్డికి ఒకవైపు టిఆర్ఎస్ వైపు నుంచి నిన్న తొలి ఝలక్ ఇవ్వగా తాజాగా నేడు టిడిపి నుంచి తొలి ఝలక్ ఇచ్చారు. ఎమ్మెల్యే హోదాలో గోల్కొండ సమావేశానికి రావాలంటూ లేఖ రాయడం చూస్తే ఇక మీదట రేవంత్ రెడ్డి అసెంబ్లీ పక్ష నేత పదవి ఊడగొట్టినట్లేనని పార్టీ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.
అయితే టిడిపి, టిఆర్ఎస్ రెండు పార్టీలు వరుసబెట్టి రేవంత్ రెడ్డికి షాకులు ఇస్తుండడం చూస్తే వీళ్లిద్దరూ బదురుకుని షాకులిస్తున్నరా ఏంది అన్న అనుమానాలు కలుగుతున్నయని రేవంత్ అభిమాన కార్యకర్త ఒకరు ఏషియానెట్ కు చెప్పారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
విజయవాడ రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి
