హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్టు ఎమ్మార్వో విజయా రెడ్డి డ్రైవర్ గురునాథం మంగళవారం నాడు డిఆర్‌డిఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సోమవారం నాడు అబ్దుల్లాపూర్‌మెట్టు ఎమ్మార్వో విజయా రెడ్డిపై సురేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు.మంటల్లో చిక్కుకొన్న ఎమ్మార్వో విజయారెడ్డిని కాపాడేందుకు డ్రైవర్ గురునాథం తీవ్రంగా ప్రయత్నించాడు. 

AlsoRead విజయారెడ్డి సజీవదహనం.... అందుకే చంపానంటున్న నిందితుడు సురేష్...

ఈ ఘటనలో గురునాథానికి 80 శాతం గాయాలయ్యాయి. దీంతో ఆయనను డీఆర్‌డీఓ అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ గురునాథం మంగళవారం నాడు ఉదయం మృతి చెందాడు.

suresh

AlsoRead Tahsildar vijaya: సురేష్‌ వెనుక ఎవరున్నారు?, కాల్‌డేటా ఆధారంగా విశ్లేషణ...

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని  అబ్దుల్లాపూర్‌మెట్టు తహసీల్దార్ కార్యాలయంలోకి ఓ దుండగుడు సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు వచ్చాడు.తహసీల్దార్ విజయారెడ్డితో మాట్లాడాలంటూ ఆమె చాంబర్‌లోకి వెళ్లాడు. తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లిన ఆ దుండగుడు ఆమెపై పెట్రోల్ పోశాడు. వెంటనే ఆమెకు నిప్పంటించాడు.

also read:vijayareddy: తహసీల్దార్ విజయారెడ్డి హత్య....బయటపడుతున్న షాకింగ్ నిజాలు

అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు  విజయారెడ్డిపై మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. దీంతో విజయారెడ్డిని కాపాడేందుకు డ్రైవర్ గురునాథం, అటెండర్ చంద్రయ్య ప్రయత్నించారు. డ్రైవర్ గురునాథం 80 శాతం కాలిపోయాడు. చంద్రయ్య 60 శాతం కాలిపోయాడు.

సూర్యాపేట జిల్లాకు చెందిన గురునాథం సుమారు ఆరు ఏళ్లుగా పనిచేస్తున్నాడు. విజయారెడ్డిని తన సోదరిగా గురునాథం భావించాడు. దీంతో ఆమె గురునాథాన్నే తన డ్రైవర్ గా కొనసాగించింది. 

డ్రైవర్ గురునాథం విజయారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించిన క్రమంలో తీవ్రంగా గాయపడ్డారు. గురునాథం కుటుంబం చాలా పేద కుటుంబం. 80 శాతం గురునాథం కాలిపోవడంతో ఆయనను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించారు. కానీ, మంగళశారం నాడు గురునాథం చికిత్స పొందుతూ మృతి చెందినట్టుగా వైద్యులు ప్రకటించారు. 

విజయారెడ్డి కుటుంబంలో సభ్యుడిగా గురునాథం ఉండేవాడని ఆ కుటుంబానికి చెందిన వాళ్లు చెబుతున్నారు. విజయా రెడ్డిపై సురేష్ పెట్రోల్ పోసి తగులపెట్టే సమయంలో ఆమె గట్టిగా కేకలు వేసింది.ఈ కేకలు వేయడంతో  డ్రైవర్ గురునాథం వెళ్లి తలుపును తెరిచే ప్రయత్నం చేశాడు. అయితే తలుపును లోపలి నుండి సురేష్ పెట్టాడు.

అయితే తలుపులను గురునాథం, అటెండర్ చంద్రయ్యలు పగుల గొట్టారు. తలుపులు పగులగొట్టేసరికి  మంటల్లో కాలిపోయిన విజయా రెడ్డి హల్ లోకి వచ్చి కుప్పకూలిపోయింది. అక్కడే మృతి చెందింది.

మంటల్లో చిక్కుకొన్న విజయా రెడ్డిని గురునాథం, చంద్రయ్యలు కార్పెట్టు, గొనెసంచుల్లు వేసి  మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు