హైదరాబాద్: ఎమ్మార్వో విజయా రెడ్డిని సజీవ దహనం చేసిన కేసులో  నిందితుడు సురేష్‌ పరిస్థితి కూడ విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. మరో  24 గంటలు దాటితేనే ఏం చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు.

AlsoRead విజయారెడ్డి సజీవదహనం.... అందుకే చంపానంటున్న నిందితుడు సురేష్...

అబ్దుల్లాపూర్ మెట్టు ఎమ్మార్వో (తహసీల్దార్) విజయా రెడ్డిపై పెట్రోల్ పోసి సురేష్ సోమవారం నాడు నిప్పంటించాడు. ఎమ్మార్వో చాంబర్‌లోనే విజయా రెడ్డిపై సురేష్  పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. ఈ ఘటనలో  విజయారెడ్డి  తహసీల్దార్ కార్యాలయంలోనే మృతి చెందింది.

విజయారెడ్డిని ఆమె చాంబర్‌లోనే వేసి సురేష్ పెట్రోల్ పోశాడు. ఆమె  బయటకు వెళ్లకుండా ఆమె చాంబర్ తలుపులకు లాక్ వేశాడు.  ఈ సమయంలో విజయా రెడ్డితో పాటు సురేష్ కు కూడ గాయాలయ్యాయి.

AlsoRead Tahsildar vijaya: సురేష్‌ వెనుక ఎవరున్నారు?, కాల్‌డేటా ఆధారంగా విశ్లేషణ...

సురేష్‌ను పోలీసులు తొలుత హయత్‌నగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స నిర్వహిస్తున్నారు.సురేష్ స్టేట్‌మెంట్‌ను కూడ పోలీసులు రికార్డు చేశారు. సురేష్‌కు కూడ తీవ్ర గాయాలైనట్టుగా వైద్యులు చెబుతున్నారు.

సురేష్‌ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 72 గంటలు దాటితేనే కానీ, సురేష్ గురించి తాము ఏం చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు.24 గంటలు దాటితేనే  కాలిన చర్మం సెప్టిక్ అయ్యే అవకాశం ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

also read:vijayareddy: తహసీల్దార్ విజయారెడ్డి హత్య....బయటపడుతున్న షాకింగ్ నిజాలు

విజయారెడ్డిపై పెట్రోల్ పోసిన క్రమంలో సురేష్ కూడ తీవ్రంగా కాలిపోయాడు.  న్యూరో బర్న్ షాక్‌లో నిందితుడు ఉన్నట్టుగా వైద్యులు ప్రకటించారు.  72 గంటలు గడిస్తేనే సురేష్ ఆరోగ్య పరిస్థితిపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందని వైద్యులు ప్రకటించారు.

సోమవారం నాడు హయత్ నగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో సురేష్ కు చికిత్స అందించారు. మంగళవారం నాడు సురేష్ ను చికిత్స కోసం సురేష్ ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 

సురేష్ కు చికిత్స అందిస్తున్న వార్డులో పోలీసుల రక్షణ ఏర్పాటు చేశారు. ఇప్పటికే సురేష్ నుండి పోలీసులు వాంగ్మూలాన్ని సేకరించారు. మరో వైపు సురేష్ కు చికిత్స పూర్తైతే పోలీసులు అతడిని అరెస్ట్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. 

ఈ కేసుకు సంబంధించి శాస్త్రీయమైన ఆధారాలను సేకరించేందుకు పోలీసులు సేకరిస్తున్నారు. తహసీల్దార్ విజయారెడ్డిని హత్య చేయాలని సురేష్ ను ఎవరైనా ప్రేరేపించారా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు.ఈ విషయమై పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. సురేష్ కాల్ డేటాతో పాటు ఇతర ఆధారాలను కూడ పోలీసులు సేకరిస్తున్నారు.