Asianet News TeluguAsianet News Telugu

కాసేపట్లో టీ.కాంగ్రెస్ కీలక నేతల భేటీ .. మునుగోడు ఉపఎన్నిక, ప్రచారంపై చర్చించే అవకాశం

కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశం కానున్నారు. ఇప్పటికే మునుగోడు టికెట్ ఆశించిన చలమల కృష్ణారెడ్డిని రేవంత్ రెడ్డి బుజ్జగించారు. అభ్యర్ధి ఖరారు కావడంతో ప్రచారాన్ని వేగవంతం చేయనుంది టీ.కాంగ్రెస్ .

t congress leaders key meeting shortly
Author
First Published Sep 10, 2022, 3:51 PM IST

శనివారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశం కానున్నారు. నల్గొండ జిల్లా ముఖ్యనేతలకు ఇప్పటికే ఆహ్వానం అందడంతో వారంతా హైదరాబాద్ చేరుకున్నారు. మునుగోడు ఉపఎన్నికపై చర్చించనున్నారు. ఇప్పటికే మునుగోడు టికెట్ ఆశించిన చలమల కృష్ణారెడ్డిని రేవంత్ రెడ్డి బుజ్జగించారు. అభ్యర్ధి ఖరారు కావడంతో ప్రచారాన్ని వేగవంతం చేయనుంది టీ.కాంగ్రెస్ .

మరోవైపు.. మునుగోడు ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీ వేగంగా పావులు కదుపుతుంది. మునుగోడు ఉపఎన్నికకు తమ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని కాంగ్రెస్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉపఎన్నిక నోటిఫికేషన్ రాకపోయినప్పటికీ.. అభ్యర్థి ఎంపిక విషయంలో ఆలస్యం పార్టీకి నష్టం చేకూరుస్తుందనే అభిప్రాయంతో కాంగ్రెస్ అధిష్టానం ముందుగానే అభ్యర్థిని ఖరారు చేసింది. పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి... టికెట్ ఆశించిన భంగపడిన నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు. వారిని బుజ్జగించడంతో పాటు కాంగ్రెస్‌ పార్టీ విజయం కోసం పనిచేయాల్సిందిగా కోరనున్నారు. 

Also REad:మునుగోడు ఉప ఎన్నికలు 2022: కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి పేరు ఖరారు

ఈ క్రమంలోనే నేడు రేవంత్ రెడ్డితో పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కోసం కలిసి పనిచేయాలని రేవంత్ రెడ్డి.. ఇరువురు నేతలకు సూచించినట్టుగా తెలుస్తోంది. అంతర్గత సమస్యలు లేకుండా.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా చలమల కృష్ణారెడ్డిని రేవంత్ రెడ్డి బుజ్జగించినట్టుగా తెలుస్తోంది. మునుగోడు టికెట్ ఆశించిన పల్లె రవి, కైలాష్ నేత‌తో కూడా రేవంత్ మాట్లాడనున్నట్టుగా తెలుస్తోంది. 

ఇక, మునుగోడు టికెట్ రావడం అదృష్టంగా భావిస్తున్నట్టుగా పాల్వాయి స్రవంతి చెప్పారు. అసలైన కార్యకర్తలు ఎవరూ పార్టీని వీడటం లేదని అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్షలాంటిదని.. దీనిని ఒక బాధ్యతగా తీసుకుని ముందుకు సాగుతానని చెప్పారు.  

Follow Us:
Download App:
  • android
  • ios