మునుగోడు ఉప ఎన్నికలు 2022: కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి పేరు ఖరారు

మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా  పాల్వాయి స్రవంతి పోటీ చేయనుంది. చలమల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్ తదితరులు పోటీ పడ్డారు. అయితే పాల్వాయి స్రవంతి అభ్యర్ధిత్వం వైపే కాంగ్రెస్ నాయకత్వం మొగ్గు చూపింది

AICC Announces palvai sravanthi as Candidate Candidate For Munugode Poll 2022

హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేయనుంది.శుక్రవారం నాడు ఎఐసీసీ ఈ మేరకు పాల్వాయి స్రవంతి పేరును ప్రకటించింది. గత మాసంలో  చలమల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి, పల్లె రవికుమార్ లతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సమావేశమయ్యారు. మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయమై చర్చించారు. వీరితో మాట్లాడిన తర్వాత ఎఐసీసీకి రాష్ట్ర నాయకత్వం అభ్యర్ధుల పేర్లను పంపింది.

రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు కూడా రాష్ట్రంలోని పార్టీ సీనియర్లతో  అభ్యర్ధి ఎంపికపై చర్చించారు. .సీనియర్ల అభిప్రాయం మేరకు పాల్వాయి స్రవంతి అభ్యర్ధిత్వం వైపు అధిష్టానం మొగ్గు చూపిందని తెలుస్తుంది. 

సంవత్సరాల తరబడి పార్టీ కోసం పనిచేస్తున్న వారికి టికెట్ ఇవ్వడం ద్వారా పార్టీ క్యాడర్ లో  విశ్వాసం కల్పించినట్టు అవుతుందని సీనియర్లు  రాష్ట్రానికి వచ్చిన పార్టీ పరిశీకుల దృష్టికి తీసుకు వచ్చారు. ఇటీవల పార్టీలో చేరిన వారికి టికెట్ కేటాయిస్తే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని సీనియర్లు చెప్పారు. దీంతో పాల్వాయి స్రవంతికి పార్టీ టికెట్ దక్కింది.

మునుగోడు అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు చలమల కృష్ణారెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. ఈ ఎన్నికల్లో పోటీ  చేయడానికి ఆర్ధిక అంశాలు కూడా కీలకమనే అభిప్రాయం కూడ పార్టీ వర్గాల్లో నెలకొంది. దీంతో చలమల కృష్ణారెడ్డి వైపు కొందరు నేతలు మొగ్గు చూపారు.కానీ, నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పాల్వాయి స్రవంతి వైపే అధిష్టానం  మొగ్గు చూపింది.

గత నెల 4 వ తేదీన కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపారు.  గత నెల 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. గత నెల 21న కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి  బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతిని పార్టీ ఎంపిక చేసింది. 

మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి ఉమ్మడి ఏపీ రాష్ట్రం నుండి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పలు దఫాలు ప్రాతినిథ్యం వహించారు. ఈ స్థానం నుండి ఎక్కువ దఫాలు కాంగ్రెస్, సీపీఐ అభ్యర్ధులు  విజయం సాధించారు.  ఉమ్మడి ఏపీ రాష్ట్రం నుండి ఈ స్థానం నుండి ప్రాతినిథ్యం వహించిన గోవర్ధన్ రెడ్డి మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ లో తెలంగాణ వాదిగా పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి ముద్ర ఉంది. 

also read:మునుగోడు ప్రజల తీర్పుతోనే కేసీఆర్ పతనం ప్రారంభం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

 పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురే పాల్వాయి స్రవంతి. 2014 లో మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి పాల్వాయి స్రవంతి పోటీ చేసి ఓటమి పాలైంది. 2018 లో ఈ స్థానం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios