Asianet News TeluguAsianet News Telugu

జగన్ ను ఫాలో అవుతున్న టీ కాంగ్రెస్ : తెలంగాణలో రివర్స్ టెండరింగ్ కు భట్టి డిమాండ్

రివర్స్ టెండరింగ్ సక్సెస్ కావడంతో తెలంగాణ కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క జగన్ ను ఫాలో అయ్యారు. తెలంగాణలో కూడా రివర్స్ టెండరింగ్ పెట్టాలంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
 

T-clp leader mallu bhatti vikramarka demands reverse tendering in telangana
Author
Hyderabad, First Published Sep 24, 2019, 4:23 PM IST

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రివర్స్ టెండరింగ్ సత్ఫలితాలు ఇస్తోంది. ఒక్క పోలవరం ప్రాజెక్టులోనే ఏపీ ప్రభుత్వానికి రూ.780 కోట్ల మేర ఆదాయం లభించింది. 

రివర్స్ టెండరింగ్ సక్సెస్ కావడంతో తెలంగాణ కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క జగన్ ను ఫాలో అయ్యారు. తెలంగాణలో కూడా రివర్స్ టెండరింగ్ పెట్టాలంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో కూడా రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకురావాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఇక్కడ కూడా రివర్స్ టెండరింగ్ తీసుకువస్తే 12శాతం తక్కువగా టెండర్లు వేసేవారని అభిప్రాయపడ్డారు. 

ఏపీలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని సత్ఫలితాలను ఇస్తుందంటూ సీఎం కేసీఆర్ జగన్ ను అభినందించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అభినందిచడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. 

త్వరలో తెలంగాణలోనూ రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అలాగే టెండరింగ్ పై జ్యుడిషియల్ కమిటీ వేసి పర్యవేక్షణ జరపాలని డిమాండ్ చేశారు. 

ఏపీలో ఎలా అయితే 12 శాతం తక్కువకు బిడ్ వేసినట్లే తెలంగాణలో కూడా వేస్తే మిషన్ భగీరథ, ఇరిగేషన్ ప్రాజెక్టలకు సంబంధించి రూ.34వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదా వచ్చేదని మల్లు భట్టి విక్రమార్క సూచించారు. 

ఏపీలో రివర్స్ టెండరింగ్ విధానం మంచి ఫలితాలను ఇవ్వడంతోపాటు ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూర్చుతున్న తరుణంలో తెలంగాణలో ప్రాజెక్టుల టెండరింగ్ పై వివరణ కోరతామన్నారు. టెండర్లపై విచారణ కోరతామని మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

టీడీపీని మూసేస్తారా..? లేక రాజకీయ సన్యాసం తీసుకుంటారా..?: చంద్రబాబూకు మంత్రి అనిల్ సవాల్

రివర్స్ టెండరింగ్ ఓ కుట్ర, సన్నిహితుల కోసమే ఆ డ్రామా: మాజీమంత్రి దేవినేని ఉమా

జగన్ ఖాతాలో మరో విజయం: రివర్స్ టెండరింగ్ లో రూ.686 కోట్లు ఆదా

జగన్ రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్: తొలి ప్రయత్నంలో రూ.58 కోట్లు ఆదా

రివర్స్ టెండరింగ్ అంటే ఉలుకెందుకు: చంద్రబాబుకు మంత్రి అనిల్ కౌంటర్

గతంలో ఫెయిల్ అయిన మ్యాక్స్ ఇన్ ఫ్రాకు టెండరా...: దేవినేని ఉమా

తక్కువ ఖర్చుతో ప్రాజెక్టుల నిర్మాణం మంచిదే: రివర్స్ టెండరింగ్ సక్సెస్ పై జేసీ

అన్ని ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్, బాబూ! చిల్లర రాజకీయాలు ఆపు: మంత్రి అనిల్

జగన్ ఏమైనా పతివ్రతా..? నీతిమంతుడిలా మాట్లాడుతున్నాడు: చంద్రబాబు ఫైర్

కాంట్రాక్టర్లకు జగన్ సర్కార్ షాక్: అడ్వాన్స్‌ ల రికవరీ

పోలవరం రివర్స్ టెండర్లు: సెప్టెంబర్ 4 తర్వాతే ముందుకు

Follow Us:
Download App:
  • android
  • ios