ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారని ఇటీవలే హైదరాబాద్ పోలీసులు శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామిపై నగర బహిష్కరణ విధించిన విషయం తెలిసిందే. ఆయనపై హైదరాబాద్ నగర కమీషనరేట్ మాత్రమే నిషేదం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పరిపూర్ణానంద మిగతా కమీషనరేట్ల పరిధిలోని ప్రాంతాలకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సైబరాబాద్, రాచకొండ కమీషనరేట్ల పరిధినుండి కూడా నిషేదం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవల రాముడిపై  అనుచిత వ్యాఖ్యలు చేసి క్రిటిక్ కత్తి మహేష్ వివాదాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. అయితే అతడిపై నగర బహిష్కరణ విధిస్తూ తెలంగాణ డిజిపి నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా కత్తి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ పరిపూర్ణానంద స్వామి హైదరాబాద్ నుండి యాదగిరి గుట్ట వరకు దర్మాగ్రహ యాత్ర చేపట్టాలని ప్రయత్నించారు. దీంతో ఆ యాత్రను అడ్డుకున్న పోలీసులు అయనపై కూడా నగర బహిష్కరణ విధించారు.

 ఈ బహిష్కరణ అమల్లో ఉన్నప్పటికి పరిపూర్ణానంద హైదరాబాద్ కి రావడానికి ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మధురవాడ విమానాశ్రయం నుండి హైదరాబద్ కు రావడానికి టికెట్ బుక్ చేసుకున్నట్లు గుర్తించారు. అయితే కేవలం హైదరబాద్ కమీషనరేట్ల పరిధిలోనే నిషేదం ఉన్నందున అతడు మిగతా రెండు కమీషనరేట్ల పరిధిలోని ప్రాంతాలకు రావడానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. దీంతో స్వామి ఇక్కడ ఉండడానికి వస్తున్నారని భావించిన పోలీసులు ముందే అప్రమత్తమయ్యారు. సైబరాబాద్, రాజకొండ కమీషనరేట్ల పరిధిలో కూడా ఆయనపై నిషేదం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రాంతాల పరిధిలో కూడా ఆయనపై 6 నెలల నిషేదం ఉంటుందని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.