Asianet News TeluguAsianet News Telugu

మునావర్ ఫారూఖీ షో మీద వీడని సందిగ్ధత... శిల్పకళావేదిక వద్ద భారీ బందోబస్తు..

హైదరాబాద్ లో ఈ రోజు జరగనున్న మునావర్ ఫారూఖీ షో మీద సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. దీంతో శిల్పకళా వేదిక దగ్గర భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Suspense continues On Munawar Faruqui show In Hyderabad
Author
Hyderabad, First Published Aug 20, 2022, 1:23 PM IST

హైదరాబాద్ : నగరంలో మునావర్ ఫారూఖీ షో మీద సస్పెన్స్ కొనసాగుతోంది. మునావర్ హాజరవుతాడా? లేదా? అనే అంశం మీద సందిగ్ధం వీడలేదు. జ్వరం రావడంతో నిన్న బెంగళూరులో జరగాల్సిన షోను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసినట్లు ఇన్ స్టా లో మునావర్ తెలిపారు. ప్రస్తుతం కోవిడ్ టెస్టు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత ఇన్ స్టా లైవ్ లోకి వస్తానన్న మునావర్ సాంకేతిక కారణాల వల్ల రాలేకపోయినట్లు తెలిపారు. కాసేపట్లో లైవ్ లోకి వస్తానని ఇన్ స్టాలో పోస్టు పెట్టారు. లైవ్ తరువాత హైదరాబాద్ షోకి హాజరయ్యేదాని మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

అయితే, అతడి షో కోసం ఇప్పటికే శిల్పకళావేదికలో నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ షోకి నిన్న మాదాపూర్ పోలీసులు అనుమించారు. దాదాపు రెండు వేల టికెట్లు నిర్వాహకులు అమ్మినట్లు సమాచారం. మరోవైపు ఈ షోని అడ్డుకుంటామని ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేవైఎం నేతలు హెచ్చరించారు. దీంతో నిన్న ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి లాలా గూడ పీఎస్ కు పోలీసులు తరలించిన విషయం తెలిసిందే. ఆ షో నేపథ్యంలో శిల్పకళావేదిక వద్ద భారీగా పోలీసులు బందోబస్తు చేపట్టారు. 

ధర్మం కంటే పార్టీ ముఖ్యం కాదు, మునావర్ షో ను అడ్డుకొంటాం: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

కాగా, హైదరాబాద్ లో మునావర్ ఫరూకీ కామెడీ షోకి తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం అనుమతినిచ్చింది. శనివారం హైదరాబాద్ లో ఈ షో ప్రదర్శించాల్సి ఉంది. అయితే, ఈ షో నిర్వహిస్తే తీవ్ర పరిణామాలుంటాయని బీజేపీ హెచ్చరించింది. షో నిర్వహిస్తే ఆ హాల్ ను దగ్ధం చేస్తామని కూడా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. మునావర్ షో నిర్వహిస్తే.. జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా గతంలోనే రాజాసింగ్ హెచ్చరించారు. 

ఈ షోకి అనుమతివ్వవద్దని బీజేవైఎం నేతలు గురువారం డీజీపీకి వినతి పత్రం సమరించారు. మునావర్ షోలో ఓ వర్గం దేవతల్ని కించపరిచేలా వ్యాఖ్యలుంటాయని ఈ షోకి అనుమతివ్వకూడదని కూడా బీజేవైఎం నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. మునావర్ షోని కర్ణాటక ప్రభుత్వం బ్యాన్ చేసిన విషయాన్ని బీజేపీ నేతలు గుర్తు చేసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios