Asianet News TeluguAsianet News Telugu

సీఎం కేసీఆర్ ను ఫాలో అవుతున్న ఉత్తమ్

తెలంగాణలో రాజకీయ సర్వేల పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. ఆయన ప్రభుత్వ పనితీరు, తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు, మంత్రుల గురించి సర్వేలు నిర్వహించడం గురించి అందరికీ తెలిసిందే. ఈ సర్వేలను కేసీఆర్ కొన్ని సార్లు అంతర్గతంగా మరికొన్ని భహిరంగంగా ప్రకటించారు. అయితే తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ మాదిరిగానే సర్వేల బాట పట్టినట్లున్నారు.

Surveys shows Congress will beat TRS : TPCC chief Uttam

తెలంగాణలో రాజకీయ సర్వేల పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. ఆయన ప్రభుత్వ పనితీరు, తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు, మంత్రుల గురించి సర్వేలు నిర్వహించడం గురించి అందరికీ తెలిసిందే. ఈ సర్వేలను కేసీఆర్ కొన్ని సార్లు అంతర్గతంగా మరికొన్ని భహిరంగంగా ప్రకటించారు. అయితే తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ మాదిరిగానే సర్వేల బాట పట్టినట్లున్నారు.

కాంగ్రెస్ చీఫ్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఇసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం చేపట్టిన సర్వేలన్ని ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే వస్తున్నాయని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారంలోకి కాంగ్రెస్ పార్టే వస్తుందని అన్నారు.

ఇక పంచాయితీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం తమ తప్పులను కప్పిపుచ్చుకోడానికే కాంగ్రెస్ పార్టీపై నిందలు వేస్తుందని తెలిపారు. ఈ విషయంలో కోర్టు కేసులకు, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. తాము కూడా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.

 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకు అధనంగా బోనస్ కూడా ఇస్తామన్నారు. రైతుల నుండి ప్రతి గింజా కొనడంతో పాటు క్రాప్ ఇన్సూరెన్స్ ను కూడా అమలుచేస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు.  

Follow Us:
Download App:
  • android
  • ios