ఇంజనీరింగ్ విద్యార్థులు కొట్టుకున్నారు ఇద్దిరికి గాయాలు ఆసుపత్రికి తరలింపు

వరంగల్ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. జిల్లాలోని నర్సంపేట శివారు జయముఖి ఇంజనీరింగ్ కళావాల విద్యార్థులు గొడవ పడ్డారు.

ఈ గొడవలో మనోజ్, రజినికాంత్ అనే విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వారి గొడవ తాలూకు వివరాలను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు.

విద్యార్థుల మధ్య గొడవ జరిగి ఇద్దరికి గాయాలు కావడంతో నర్సిపేటలో, వరంగల్ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 

ఈ ఘర్షణకు సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.