స్కూల్లోనే మందుతాాగుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ విద్యార్థులు మందలించిన టీచర్ నే తాగుబోతును చేయడానికి ప్రయత్నించిన ఘటన ములుగు జిల్లాలో వెలుగుచూసింది. 

ములుగు : స్కూల్ కు వెళ్లాల్సిన వయసులోనే కొందరు విద్యార్థులు మద్యానికి బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చివరకు విద్యాబుద్దులు నేర్చుకునే పవిత్రమైన విద్యాసంస్థల్లోనూ మందుకొడుతూ కొందరు ఆకతాయి పనులకు పాల్పడుతున్నారు.ఇలా స్కూల్లో మందుతాగుతుంటే మందలించిన కొందరు విద్యార్థులు ఉపాధ్యాయున్నే బలి చేయాలని చూసారు.కానీ వారి నాటకం బయటపడి అడ్డంగా దొరికిపోయారు. 

వివరాల్లోకి వెళితే... ములుగు జిల్లా మల్లంపల్లిలోని గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కొందరు గత శనివారం రాత్రి మద్యం తాగారు. గురుకుల హాస్టల్ సిబ్బంది కళ్లుగప్పి బయటకు వెళ్లిన విద్యార్థులు ఓ వైన్ షాప్ లో మద్యం కొనుగోలు చేసారు. ఆ మందు బాటిల్స్ తీసుకువచ్చి స్కూల్ నే బార్ గా మార్చేశారు. తొమ్మిదో తరగతికి చెందిన ఏడుగురు, ఇంటర్మీడియట్ కు చెందిన ఇద్దరు స్టూడెంట్స్ కలిసి స్కూల్లోనే కూర్చుని మందు తాగారు. 

స్కూల్లో ఏదో అలజడి కావడంతో వ్యాయామ ఉపాధ్యాయుడు వెళ్లిచూడగా విద్యార్థులు మద్యం సేవిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.దీంతో వారిని మందలించి మరోసారి ఇలాచేస్తే బావుండదంటూ ఉపాధ్యాయుడు హెచ్చరించాడు. మళ్లీ ఇలా చేయకుండా పట్టుబడిన విద్యార్థులతో ఓ లెటర్ రాయించుకున్నాడు. దీంతో ఎక్కడ పిటి టీచర్ తమ తాగుబోతు బాగోతం బయటపెడతాడోనని భయపడిపోయిన విద్యార్థులు కొత్త నాటకానికి తెరతీసారు. 

Read More హైదరాబాద్‌లో 12 ఏళ్ల బాలుడి మిస్సింగ్ కలకలం.. ఆందోళన చెందుతున్న తల్లి..!

ఆదివారం ఉదయమే హాస్టల్ సిబ్బందికి చెప్పకుండానే తొమ్మిదిమంది విద్యార్థులు బయటకు వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లి మద్యం తాగుతూ ఉపాధ్యాయుడే తమకు పట్టుబడ్డాడని... ఈ విషయం ఎవరికీ చెప్పొందని బెదిరించి తామే మద్యం తాగినట్లుగా రాయించుకున్నాడని తల్లిదండ్రులకు తెలిపారు. తమ పిల్లల మాటలు నమ్మిన తల్లిదండ్రులు కోపంతో హాస్టల్ వద్దకు వెళ్లి ఉపాధ్యాయున్ని నిలదీసారు. అతడు ఎంతచెప్పినా వినకుండా ఉన్నతాధికారులకు పిర్యాదు చేసారు. దీంతో అధికారులు ఈ వ్యవహారంపై విచారింగా విద్యార్థులే మద్యం సేవించి నాటకమాడినట్లు బయటపడింది. 

మల్లంపల్లిలోని ఓ వైన్ షాప్ లో విద్యార్థులు మద్యం కొనుగోలు చేస్తున్న దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో మైనర్లకు మద్యం అమ్మిన వైన్ షాప్ పై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసారు. వ్యాయామ ఉపాధ్యాయుడి తమ్మేమీ లేదని అధికారులు తేల్చారు.