హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ బండ్లగూడలో 12 ఏళ్లు బాలుడి మిస్సింగ్ కలకలం రేపుతోంది. నిన్న రాత్రి బయటకు వెళ్లిన బాలుడు ఇంటికి తిరిగిరాకపోవడంతో అతడి తల్లి తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ బండ్లగూడలో 12 ఏళ్లు బాలుడి మిస్సింగ్ కలకలం రేపుతోంది. నిన్న రాత్రి బయటకు వెళ్లిన బాలుడు ఇంటికి తిరిగిరాకపోవడంతో అతడి తల్లి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వివరాలు.. కనిపించకుండా పోయిన బాలుడు సాయి చరణ్ కుటుంబం బండ్లగూడలో నివాసం ఉంటుంది. బుధవారం రాత్రి చిట్టి డబ్బులు ఇచ్చేందుకు బయటకు వెళ్లిన సాయి చరణ్ తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో సాయి చరణ్ కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలింపు చేపట్టారు. తెలిసివారిని కూడా సంప్రదించారు. అయితే లాభం లేకపోవడంతో.. చివరకు రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించారు.
Also Read: వైసీపీకి భారీ షాక్.. విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీకి పంచకర్ల రాజీనామా..
సాయి చరణ్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సాయి చరణ్ ఇంటి సమీప ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నారు. సాయి చరణ్ మిస్సింగ్ కావడంతో అతడి తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
