హైదరాబాద్‌లో దారుణం : స్కూల్లో ఆడుకుంటుండగా విద్యార్ధికి కరెంట్ షాక్.. 50 శాతం కాలిపోయిన శరీరం
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మెరీడియన్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యుత్ షాక్‌తో విద్యార్ధికి తీవ్రగాయాలయ్యాయి. ఆ విద్యార్ధికి దాదాపు 50 శాతం మేర శరీరం కాలిపోయినట్లుగా సమాచారం.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మెరీడియన్ ఇంటర్నేషనల్ స్కూల్లో దారుణం జరిగింది. లంచ్ టైంలో ఆడుకుంటున్న విద్యార్ధికి కరెంట్ షాక్ తగిలింది. ప్రహరీకి వున్న విద్యుత్ ఫెన్సింగ్ తగలడంతో ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాల పాలైన విద్యార్ధిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న విద్యార్ధి తల్లిదండ్రులు స్కూల్‌కు చేరుకుని యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు.
గాయపడిన విద్యార్ధిని హసన్‌గా గుర్తించారు. ఇతను స్కూల్లో 11 వ తరగతి చదువుకుంటున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో ఆడుకుంటూ వుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ విద్యార్ధికి దాదాపు 50 శాతం మేర శరీరం కాలిపోయినట్లుగా సమాచారం. ట్రాన్స్ఫార్మర్కు సమీపంలో ఐరన్ రాడ్స్ వుండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.