Asianet News TeluguAsianet News Telugu

నేటి నుంచి కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పాద‌యాత్ర.. కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ !

Hyderabad: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాదయాత్రను ప్రారంభించి సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ ను మ‌రోసారి అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో కసరత్తు చేస్తున్నారు. ములుగు నియోజకవర్గంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడారం వ‌న‌దేవ‌త‌లు సమ్మక్క సారలమ్మల ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి ఆయ‌న రాష్ట్రవ్యాప్త పాద‌యాత్ర‌ను ప్రారంభించ‌నున్నారు.
 

Special pooja at Medaram Sammakka Saralamma.. Congress chief Revanth Reddy's padayatra starts today
Author
First Published Feb 6, 2023, 10:10 AM IST

TPCC chief Revanth Reddy Yatra : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాదయాత్రను ప్రారంభించి సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ ను మ‌రోసారి అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో కసరత్తు చేస్తున్నారు. ములుగు నియోజకవర్గంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడారం వ‌న‌దేవ‌త‌లు సమ్మక్క సారలమ్మల ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి ఆయ‌న రాష్ట్రవ్యాప్త పాద‌యాత్ర‌ను ప్రారంభించ‌నున్నారు. అంత‌కుముందు,  రాష్ట్రంలో నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయిన సమయంలో వైఎస్సార్ చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి నెలకొందని అందుకే, కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ప్ర‌జ‌ల్లోకి వెళ్లడానికి పాద‌యాత్ర‌ను ప్రారంభిస్తున్నార‌ని ఆ పార్టీ వ‌ర్గాలు తెలిపాయి.

పార్టీ హాత్ సే హాత్ జోడో అభియాన్ కు కొనసాగింపుగా చేపట్టిన 'యాత్ర'తో వైఎస్ మాదిరిగానే ప్రజల్లోకి వెళ్లాలని రేవంత్ రేడ్డి భావిస్తున్నారు. యాదృచ్ఛికంగా వైఎస్సార్ పై తీసిన సినిమాకు 'యాత్ర' అనే టైటిల్ పెట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రతి ఇంటికీ చేరవేయడానికి ఉద్దేశించిన హాత్ సే హాత్ జోడో అభియాన్ ను తన యాత్రకు విస్తరింపజేయడానికి, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్యమైన సమస్యలు, విఫలమైన వాగ్దానాలను ఎత్తిచూప‌డం ల‌క్ష్యంగా ఆయ‌న యాత్ర‌తో ముందుకు సాగుతార‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. 2003లో ఉన్న పరిస్థితినే 2023లోనూ పునరావృతం చేస్తున్నారు. విద్యుత్ రంగంలో సంక్షోభం నెలకొందనీ, రైతులకు కనీస మద్దతు ధర లేకుండా పోయిందని, రుణమాఫీ జరుగుతోందని, ఈ సమయంలో యాత్ర చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.

రేవంత్ రెడ్డి పాద‌"యాత్ర" వివ‌రాలు ఇలా ఉన్నాయి.. 

  • ప్ర‌జా స‌మ‌స్య‌లు, ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధ‌నాలు, బీఆర్ఎస్ స‌ర్కారు వైఫ‌ల్యాలు ఎత్తిచూప‌డంతో పాటు భార‌త్ జోడో యాత్ర వివ‌రాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డం, రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా రేవంత్ రెడ్డి పాద యాత్ర ప్రారంభం కానుంది. 
  • సోమ‌వారం నుంచి ప్రారంభం కానున్న రేవంత్ రెడ్డి పాద‌యాత్ర‌.. ప‌రిస్థితుల‌కు అనుస‌రించి 60 రోజుల వ‌ర‌కు కొన‌సాగే అవ‌కాశ‌ముంది. ఈ స‌మ‌యంలో దాదాపు 100 నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌వ‌ర్ చేయ‌నున్న‌ట్టు కాంగ్రెస్ వ‌ర్గాలు తెలిపాయి. 
  • కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర ముగిసిన త‌ర్వాత ఆ పార్టీ దేశ‌వ్యాప్తంగా హత్ సే హత్ జోడో అభియాన్ ప్రారంభించింద‌తి. ఈ క్రమంలోనే తెలంగాణ‌లో రేవంత్ రెడ్డి  హత్ సే హత్ జోడో అభియాన్ ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌నున్నారు. 
  • రేవంత్ రెడ్డి త‌న పాద‌యాత్ర‌కు ముందు ములుగు జిల్లాలోని ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజ‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఆ త‌ర్వాత 12 గంట‌ల‌కు త‌న పాద‌యాత్ర‌ను ప్రారంభించ‌నున్నారు. 
  • రేవంత్ రెడ్డి పాద‌యాత్ర గురించి సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. సోమ‌వారం ఉదయం 8 గంటలకు హైద్రాబాద్ లోని తన నివాసం నుంచి పాదయాత్రకు బయలు దేరుతారు. 
  • వరంగల్ హైవే మీదుగా ములుగుకు చేరుకుని గట్టమ్మ, సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వ‌హిస్తారు. ఉదయం 11 గంటలకు  మేడారం సమ్మక్క సారలమ్మ వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. 
  • మేడారం సమ్మక్క సారలమ్మ వద్ద ప్రత్యేక పూజల అనంత‌రం.. 12 గంటలకు పాదయాత్ర ప్రారంభించనున్నారు. మేడారం నుంచి కొత్తూరు,నార్లాపుర్, ప్రాజెక్ట్ నగర్ వరకు పాదయాత్ర సాగుతుంది. 
  • మధ్యాహ్నం 2 నుంచి 2 30 వరకు ప్రాజెక్ట్ నగర్ లో భోజన విరామం ఉంటుంది. ప్రాజెక్ట్ నగర్ నుంచి మధ్యాహ్నం 2:30 గంటలకు పాదయాత్ర మ‌ళ్లీ మొద‌ల‌వుతుంది.  
  • సాయంత్రం 4:30 నుంచి 5 గంటలకు పస్రా గ్రామంలో టీ విరామం ఉంటుంది. పస్రా జంక్షన్ లో సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కార్నర్ మీటింగ్ ఉండ‌నుంది. 
  • తిరిగి సాయంత్రం 6 గంకలకు పస్రా నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. రాత్రి 8 గంటలకు రామప్ప గ్రామానికి చేరుకుంటుంద‌తి. రాత్రికి రామప్ప గ్రామంలో రేవంత్ రెడ్డి బస చేయ‌నున్నారు. 
Follow Us:
Download App:
  • android
  • ios