టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు టీఆర్ఎస్ నేత, ఐవీఎఫ్ తెలంగాణ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ ఓ అపురూపమైన కానుకను అందించారు.

 

"

 

కేటీఆర్ బాల్యం, విద్యాభ్యాసం, పొలిటికల్ కెరియర్, విజయాలు, ప్రపంచవ్యాప్తంగా చేసిన పర్యటనలు, ప్రజల కోసం చేసిన పోరాటాలు, హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో చేసిన కృషిని వివరిస్తున్న దృశ్యమాలికలతో శ్రీనివాస్ ఓ పెయింటింగ్‌ను వేయించారు. సామాజిక అంశాలపై పెయింటింగ్స్ వేసే కందుకూరి వెంకటేశ్‌ దీనిని వేశారు.

Also Read:నీతో గడిపిన రోజులు మరవలేను.. కేటీఆర్ కి సెలబ్రెటీల విషెస్

ఈ భారీ పెయింటింగ్‌లో కేసీఆర్ లాంతర్‌తో ధైర్యంగా నడుస్తుంటే వెనకాలే కేటీఆర్ నవ్వుతూ నడుస్తున్నట్లు, అంధకారం నుంచి వెలుగులను కేటీఆర్‌ చూస్తున్నట్లు, మెట్రో పరుగులు, ఐటీ హంగుల మేళవింపు, ఇన్ఫ్మరేషన్, విజన్, అకౌంటబులిటీ అనే పదాలతో చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ తన కుమారులతో ప్రగతి భవన్‌లో అందించారు. తనపై చూపిన అభిమానానికి కేటీఆర్.. ఉప్పలను ధన్యవాదాలు తెలిపారు.