తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు నేడు 44వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఆయనకు ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజకీయ ప్రముఖులు , అభిమానులు, సినీ తారలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 రాష్ట్ర ఆర్థికమంత్రి హరీష్‌ రావు, రాజ్యసభ సభ్యడు జోగినపల్లి సంతోష్‌ ట్విటర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే అన్నయ్య. మరెన్నో ఏండ్లు ప్రజాసేవలో కొనసాగాలి. మరిన్ని పెద్ద పదవులను చేపట్టాలి. మమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉండాలి. మీరొక ఐకాన్‌. సమకాలీన రాజకీయాల్లో రెండో స్థానానికి నా సోదరుడు తప్ప మరెవరూ సాటిరారని చెప్పడానికి గర్వంగా ఉంది. చిన్నప్పుడు నీతో గడిపిన రోజులు మధురమైన జ్ఞాపకాలు’ అని సంతోష్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌తో దిగిన చిన్ననాటి ఫొటోను సోషల్‌ మీడియాతో‌ పంచుకున్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం కేటీఆర్ కి బర్త్ డే విషెస్ తెలియజేశారు. ‘జన్మదిన శుభాకాంక్షలు డియర్‌ తారక్‌‌. ప్రజలకు సేవ చేయడానికి మరింత శక్తితో ముందుకు సాగాలి’ అంటూ తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేశారు. 

 

 

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు కూడా కేటీఆర్ కి బర్త్ డే విషెస్ తెలియజేశారు. వారికి కేటీఆర్ ట్విట్టర్ లో రిప్లే కూడా ఇవ్వడం గమనార్హం.