తండ్రి రెండో పెళ్లి.. తట్టుకోలేక సుత్తితో కొట్టి చంపిన కొడుకు...

తండ్రి రెండో పెళ్లి చేసుకుని తమను పట్టించుకోవడం లేదని కోపంతో ఓ కొడుకు.. తండ్రిని సుత్తెతో కొట్టి చంపేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది. 

son killed father over his second marriage in hyderabad - bsb

హైదరాబాద్ : తన తండ్రి రెండో పెళ్లి చేసుకుని తమను చూసుకోవడం లేని మనస్తాపం చెందిన 23 ఏళ్ల యువకుడు 54 ఏళ్ల వయసున్న తండ్రిని కొట్టి చంపాడు. అతను ప్రైవేట్ ఉద్యోగి. ఉప్పల్‌లోని అద్దె ఇంట్లో ఉంటున్నారు. అక్కడే తండ్రిని కొట్టి చంపాడు. మృతుడు టెంట్ హౌస్ వ్యాపారం చేసేవాడు. బాధితుడు పాండు సాగర్ రామంతపూర్ వివేక్ నగర్‌లోని సూర్య అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. 

అతనికి మొదటి భార్యతో పాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం సాగర్ పీర్జాదిగూడకు చెందిన మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఇటీవల అతను తన రెండవ భార్యతో ఎక్కువ సమయం గడపడం ప్రారంభించాడు. తన మొదటి భార్య దగ్గరికి, కొడుకుల వద్దకు వెళ్లడం మానేసినట్లు పోలీసులు తెలిపారు.

వైరాలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళం.. బాణసంచా పేల్చడంతో ఘోర ప్రమాదం.. 8 మందికి తీవ్ర గాయాలు..

సాగర్ పెద్ద కుమారుడు పవన్ కుటుంబాన్ని తండ్రి పట్టించుకోకపోవడం విషయంలో మనస్తాపం చెందాడు. "మొదటి భార్య కుటుంబానికి డబ్బులు ఇవ్వకపోవడంతో వారు మనస్తాపం చెందారు. రెండో భార్య దగ్గరే ఉంటూ ఆమెకే డబ్బులు ఇస్తున్నాడని అనుమానించారు" అని పోలీసులు తెలిపారు.

సాగర్ తన టెంట్ హౌస్ వ్యాపారానికి సంబంధించిన వస్తువులను ఉంచేందుకు ఉప్పల్‌లోని శ్రీనివాసపురంలో ఇటీవల ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నాడు. సోమవారం సాయంత్రం, సాగర్ ఆ ఫ్లాట్‌లో ఉన్నప్పుడు పవన్ అక్కడికి వచ్చాడు. కుటుంబాన్ని పరామర్శించుకోవడంలేదని తండ్రితో వాగ్వాదానికి దిగాడు. ఆ తరువాత తనతో తెచ్చుకున్న తండ్రి తలపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో సాగర్ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. పవన్ అక్కడినుంచి పరారయ్యాడు.

ఇరుగుపొరుగు వారి సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశారు. మంగళవారం నాడు పవన్‌ను అరెస్టు చేశారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios