సోమవారం ఉదయం తల్లిదండ్రులు గేటు ముందు ఉండగా లోపలికి వెళ్లిన  నిరీశ రెండు గంటలైనా తిరిగి రాలేదు. ఇంతలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మీ కూతురు లింగంపల్లిలో ఉందని చెప్పి ఆమెతో మాట్లాడించాడు.  అక్కడికి వెళ్ళిన కొద్దిసేపటికి మళ్ళీ ఫోన్ చేసి వద్ద  జె ఎన్ టి యు వద్ద ఉందని చెప్పడంతో అక్కడికి వెళ్లారు.

గచ్చిబౌలి : హైదరాబాద్ గచ్చిబౌలిలో పక్కా సినిమా తరహాలో ఓ కిడ్నాప్ చోటు చేసుకుంది. ఆఫీసులోకి వెళ్లిన ఓ మహిళా టెకీ అంతలోనే కిడ్నాప్ అయ్యింది. తల్లిదండ్రులకు ఫోన్ చేసిన ఓ అజ్ఞాత వ్యక్తి కూతురు ఇక్కడుంది, అక్కడుంది అంటూ సాయంత్రం వరకు తిప్పిచ్చి.. వారిని తప్పుదోవ పట్టించాడు. వివరాల్లోకి వెడితే... 

ఓ Software Engineer అదృశ్యమైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏ ఎస్ ఐ సాయిలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా అచ్చంపేటకు చెందిన జి. నిరీష (27) గచ్చిబౌలిలోని Infosysలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తుంది.గుంటూరు లోనే ఉంటూ 
Work from home చేస్తున్న ఆమె ఇటీవల Laptop కంపెనీలో ఇవ్వాలని తల్లిదండ్రులు గంగసాని వెంకటేశ్వర్రెడ్డి, అనురాధ లను తీసుకొని కంపెనీ వద్దకు వచ్చింది.

సోమవారం ఉదయం తల్లిదండ్రులు గేటు ముందు ఉండగా లోపలికి వెళ్లిన నిరీశ రెండు గంటలైనా తిరిగి రాలేదు. ఇంతలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మీ కూతురు లింగంపల్లిలో ఉందని చెప్పి ఆమెతో మాట్లాడించాడు. అక్కడికి వెళ్ళిన కొద్దిసేపటికి మళ్ళీ ఫోన్ చేసి వద్ద జె ఎన్ టి యు వద్ద ఉందని చెప్పడంతో అక్కడికి వెళ్లారు.

అయితే అక్కడ కూడా కూతురు కనిపించలేదు. తనకు ఫోన్ చేసిన నెంబర్ కి కాల్ చేస్తే.. ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీంతో మంగళవారం గచ్చిబౌలి పిఎస్ లో తల్లి అనురాధ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

నడిరోడ్డుపై మహిళ దారుణ హత్య.. కత్తులతో పొడిచి చంపిన రెండో భర్త..

ఇదిలా ఉండగా, రంగారెడ్డి జిల్లాలో డిసెంబర్ 24న ఘోర సంఘటన జరిగింది. ఓ వ్యక్తి మహిళను నమ్మించి, మద్యం తాగించి rape attemptకి పాల్పడ్డాడు. ఆమె మెడలో ఉన్న బంగారు నగలను అపహరించి పరారయ్యాడు. చివరకు cc cameraల ఆధారంగా దొరికిపోయిన నిందితుడు.. ఇంటి అప్పు తీర్చేందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో అంగీకరించాడు. 

ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఏసీపీ రవీందర్ రెడ్డి, షాబాద్ సీఐ అశోక్ గురువారం తెలిపారు. షాబాద్ మండలం పోతుగల్ కు చెందిన కామారెడ్డి జయమ్మ (40) ఈ నెల 20న శంకర్ పల్లి మండలం బుల్కాపూర్ లో బంధువుల గృహప్రవేశానికి వెల్తుండగా అదే గ్రామానికి చెందిని కేశపల్లి మల్లారెడ్డి.. తానూ బుల్కాపూర్ వెల్తున్నానని చెప్పి ఆమెను బైక్ మీద ఎక్కించుకున్నాడు. 

మార్గమధ్యలో ఆమెకు liquor తాగించాడు. దీంతో జయమ్మ స్పృహ తప్పి పడిపోవడంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఆమె మెడలోని పుస్తెల తాడు దొంగిలించేందుకు ప్రయత్నించగా స్పృహలోకి వచ్చిన జయమ్మ ప్రతిఘటించింది. దీంతో చీరకొంగు మెడకు బిగించి హతమార్చాడు. తరువాత ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు నగలతో పాటు కాళ్ల కడియాలు, పట్టాగొలుసులు తీసుకుని పరారయ్యాడు. కాగా, జయమ్మ భర్త జంగయ్య భార్య కనిపించడం లేదని షాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలించగా, కేశపల్లి మల్లారెడ్డి ఆమెను బైకు మీద తీసుకువెల్తున్నట్లు కనిపించింది. దీంతో మల్లారెడ్డిని గురువారం అదపులోకి తీసుకుని విచారించగా, ఇంటి నిర్మాణానికి చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక ఈ ఘటనకు పాల్పడినట్టు చెప్పాడని పోలీసులు తెలిపారు. మల్లారెడ్డి మీద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ రవీందర్ రెడ్డి, సీఐ అశోక్ మీడియాకు వెల్లడించారు.