హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో (Kukatpally) ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేపీహెచ్‌బీ కాలనీ వద్ద బైక్‌ను టిప్పర్ (tipper hits bike) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న జగన్ మోహన్‌రెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. 

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో (Kukatpally) ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేపీహెచ్‌బీ కాలనీ వద్ద బైక్‌ను టిప్పర్ (tipper hits bike) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న జగన్ మోహన్‌రెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత టిప్పర్ అక్కడ ఆగకుండా వెళ్లింది. దీంతో బాధితుడి మృతదేహాన్ని టిప్పర్ 20 మీటర్లు ఈడ్చుకెళ్లింది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా చెబుతున్నారు. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనస్థలానికి చేరుకున్నారు. 

పోస్టుమార్టమ్ నిమిత్తం జగన్ మోహన్‌రెడ్డి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడు జగన్ ‌మోహన్‌రెడ్డి software engineer పనిచేస్తున్నాడు. ఇక, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

ఎల్బీ నగర్‌లో కారు బీభత్సం..
ఇదిలా ఉంటే ఎల్బీ నగర్‌లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కారు బీభత్సం సృష్టించింది. సాగర్ రింగ్ రోడ్డు వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు.. ఎల్బీ నగర్‌ అండర్ పాస్‌లో బోల్తా కొట్టింది. డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత అందులో ఉన్నవారు.. కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. అక్కడికి కొద్ది దూరంలోనే ఉన్న గస్తీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. 

ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రోడ్డుకు అడ్డంగా బోల్తాపడిన కారును అక్కడి నుంచి తరలించారు. అయితే కారు నడుతుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అంచనా వేస్తు్నారు. కారుపై రూ.13,300 పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లు ఉన్నట్టు గుర్తించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా, ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది.