కాళేలేశ్వరం ప్రాజెక్టు పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతుండగా హటాత్తుగా ప్రమాదం నెలకొంది.

ప్రాజెక్టు పరిధిలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం, తిప్పాపూర్ వద్ద సొరంగంలో మట్టి పెల్లలు కూలిపోయాయి.

ప్రాజెక్టు పరిధిలోని 10 వ ప్యాకేజీలో నిర్మిస్తున్న టన్నేల్ పనుల వద్ద హెయిర్ బ్లాస్టింగ్ తో టన్నెల్ కూలింది.                       

ఈ ప్రమాదంలో ఏడుగురు కూలీలు మరణించారు.

మరణించిన వారిలో ఐదుగురు కూలీలు ఉత్తర ప్రదేశ్ కు చెందిన వారిగా చెబుతున్నారు.

ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. వారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. 

ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి విచారణ జరుపుతున్నారు.

ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి