Asianet News TeluguAsianet News Telugu

జడ్చర్ల కాంగ్రెస్ నేత రామచంద్రారెడ్డి మర్డర్: 100 కి.మీ డెడ్‌బాడీతో కారులోనే....

భూ వివాదాన్ని పరిష్కరించుకొందామని చర్చలకు పిలిచి హత్య చేశాడు. ఆ తర్వాత 100 కి.మీ దూరం డెడ్‌బాడీతోనే ప్రయాణించాడు.జడ్చర్ల కాంగ్రెస్ నేత రామచంద్రారెడ్డి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Shadnagar police arrested two persons in ramachandra reddy murder
Author
Shadnagar, First Published Jun 23, 2020, 10:31 AM IST


షాద్‌నగర్: భూ వివాదాన్ని పరిష్కరించుకొందామని చర్చలకు పిలిచి హత్య చేశాడు. ఆ తర్వాత 100 కి.మీ దూరం డెడ్‌బాడీతోనే ప్రయాణించాడు.జడ్చర్ల కాంగ్రెస్ నేత రామచంద్రారెడ్డి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

జడ్చర్ల పట్టణానికి చెందిన రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ నేత. రామచంద్రారెడ్డికి ప్రతాప్ రెడ్డికి మధ్య  షాద్ నగర్ మండలం అన్నారం గ్రామంలోని భూమి విషయంలో వివాదం ఉంది. 

ఈ విషయమై ఇరు వర్గాల మధ్య కొంత కాలం క్రితం పెద్ద మనుషుల మధ్య ఒప్పందం జరిగింది. 9 ఎకరాల 9 గుంటల భూమిలో ఐదు ఎకరాలను ప్రతాప్ రెడ్డికి ఇవ్వాలని పెద్ద మనుషులు చెప్పారు. 

అయితే భూమికి బదులుగా ఆ భూమిని తానే ఉంచుకొని ప్రతాప్ రెడ్డికి రూ. 2.75 కోట్లు ఇస్తానని రామచంద్రారెడ్డి ప్రతాప్ రెడ్డికి హామీ ఇచ్చారు.  ఈ మేరకు భూమి డాక్యుమెంట్లు, కోర్టు కాపీలు తీసుకొన్నారు.

also read:జడ్చర్ల కాంగ్రెస్ నేత రామచంద్రారెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ

రామచంద్రారెడ్డి మాత్రం ప్రతాప్ రెడ్డికి మాత్రం డబ్బులు ఇవ్వలేదు. కాలాయాపన చేశాడు.  ఇదే భూమిలో తన తల్లి పార్థీవ దేహాన్ని పూడ్చేందుకు ప్రయత్నిస్తే రామచంద్రారెడ్డి అడ్డుకొన్నాడు. 

రామచంద్రారెడ్డి డబ్బులు ఇస్తే అప్పులు తీర్చాలని ప్రతాప్ రెడ్డి భావించాడు. కానీ రామచంద్రారెడ్డి మాత్రం డబ్బులు ఇవ్వలేదు. దీంతో అతడిని చంపాలని నిర్ణయం తీసుకొన్నాడు. 

ఈ నెల 19వ తేదీన రామచంద్రారెడ్డిని చర్చలకు పిలిచి ప్రతాప్ రెడ్డి పథకం ప్రకారం హత్య చేయాలని ప్లాన్ వేశాడు.
అయితే ఆ రోజు మధ్యాహ్నం తనకు అర్జంట్ పని ఉందని రామచంద్రారెడ్డి చర్చల మధ్యలో వెళ్లిపోయాడు. సాయంత్రం పూట మరోసారి రామచంద్రారెడ్డిని ప్రతాప్ రెడ్డి పిలిచాడు.

రామచంద్రారెడ్డి కారు డ్రైవర్ భాషాను ప్రతాప్ రెడ్డి బెదిరించారు. దీంతో అతను కారు వదిలి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. ప్రతాప్ రెడ్డి డ్రైవర్ విజయ్ కారును నడుపుతోంటే  రామచంద్రారెడ్డిని కారులోనే ప్రతాప్ రెడ్డి కత్తెర, కత్తితో కసితీరా పొడిచి చంపాడు.

కారులోనే మృతదేహాంతో ప్రయాణించారు. షాద్ నగర్ నుండి కేశంపేట, కడ్తాల్ తదితర ప్రాంతాల మీదుగా  100 కిమీ ప్రయాణించి కొత్తూరు మండలం పెంజర్లలో రామచంద్రారెడ్డి డెడ్‌బాడీని  వదిలేసి పారిపోయారు. 

రామచంద్రారెడ్డి డ్రైవర్ భాషా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన ప్రతాప్ రెడ్డితో పాటు అతనికి సహకరించిన డ్రైవర్ విజయ్ లను అరెస్ట్ చేసినట్టుగా షాద్‌నగర్ పోలీసులు తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios