షాద్‌నగర్: భూ వివాదంలోనే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రామచంద్రారెడ్డిని హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. రామచంద్రారెడ్డి ఒంటిపై 28 చోట్ల కత్తితో పొడవడంతో ఆయన మరణించాడని పోలీసులు తెలిపారు.

జడ్చర్ల పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రామచంద్రారెడ్డికి ఆయన సమీప బంధువు ప్రతాప్‌రెడ్డితో ఓ భూ వివాదం ఉంది. షాద్ నగర్ మండలం అన్నారం గ్రామంలో 9 ఎకరాల 9 గుంటల భూమి విషయంలో వీరిద్దరి మధ్య గొడవే ఈ హత్యకు కారణంగా పోలీసులు చెప్పారు.

also read:రంగారెడ్డి జిల్లాలో రియల్ ఏస్టేట్ వ్యాపారి సత్తయ్య హత్య

ఈ భూ విషయమై రామచంద్రారెడ్డి, ప్రతాప్ రెడ్డిలు శుక్రవారం నాడు మధ్యాహ్నం మాట్లాడుకొన్నారు. సాయంత్రం పూట రామచంద్రారెడ్డిని ప్రతాప్ రెడ్డి కిడ్నాప్ చేసి హత్య చేసినట్టుగా పోలీసులు చెప్పారు.

అన్నారం గ్రామంలోని భూ వివాదమే ఈ హత్యకు కారణంగా పోలీసులు ప్రకటించారు. ప్రతాప్ రెడ్డికి ఇంకా ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కిడ్నాప్ చేసీ పెంజర్ల వద్ద రామచంద్రారెడ్డిని ప్రతాప్ రెడ్డి హత్య చేశాడు. రామచంద్రారెడ్డి ఒంటిపై 28 కత్తిపోట్లు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రతాప్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.రామచంద్రారెడ్డి డ్రైవర్ ను ప్రతాప్ రెడ్డి బెదిరించడంతో అతను పారిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.