జీవో 16 ను కొట్టేసిన హైకోర్టు

తెలంగాణ సర్కారు హైకోర్టులో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మొన్న సింగరేణి వారసత్వ ఉద్యోగాల నియామకం చెల్లదని ప్రభుత్వ జీవోను కొట్టేసిన హైకోర్టు ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ జీవోను కూడా తప్పుపట్టింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

టీఆర్ఎస్ సర్కారు తన ఎన్నికల హామీలో భాగంగా కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసేందుకు జీవో 16 ను గతంలో విడుదల చేసింది.

అయితే ఈ జీవోను సవాలు చేస్తూ ఓయూ విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘంగా విచారించిన అనంతరం కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసే జీవోను కొట్టేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.