Asianet News TeluguAsianet News Telugu

సెంటిమెంట్: ఆ పదవి కొండా మురళికి కలిసి రాలేదా

కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి అచ్చి రాలేదా... అంటే అవుననే ఆయన అనుచరులు అభిప్రాయపడుతున్నారు

sentiment:konda murali resigned second time mlc post
Author
Warangal, First Published Dec 25, 2018, 8:11 PM IST


హైదరాబాద్: కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి అచ్చి రాలేదా... అంటే అవుననే ఆయన అనుచరులు అభిప్రాయపడుతున్నారు.పరకాల అసెంబ్లీ నుండి  సురేఖ పోటీ చేసి ఓడిపోవడం.. ఎమ్మెల్సీ పదవిని కొండా మురళి అర్ధాంతరంగా వదులుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.  యాధృచ్చికంగా జరిగినా కూడ  దీన్ని సెంటిమెంట్‌గా కొండా అనుచరులు భావిస్తున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల అసెంబ్లీ సెగ్మెంట్ నుండి  ఇటీవల జరిగిన పరకాల అసెంబ్లీ నుండి కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ  తరపున పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

కొండా దంపతులు టీఆర్ఎస్‌లో ఉన్న సమయంలో  స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  వరంగల్ జిల్లా నుండి కొండా మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే కొండా దంపతులు టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరినందున కొండా మురళి మూడు రోజుల క్రితం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. 

ఇలా రెండో సారి ఎమ్మెల్సీ పదవికి కొండా మురళి రాజీనామా చేయడం ఇది రెండో సారి. గతంలో కూడ ఇదే రకంగా  మురళి అర్ధాంతరంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

2009లో  కాంగ్రెస్ పార్టీ నుండి కొండా దంపతులు  వైసీపీలో చేరారు. మంత్రి పదవికి కూడ కొండా సురేఖ రాజీనామా చేశారు. 2012లో జరిగిన పరకాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సురేఖ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికి మురళి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆ సమయంలో డిమాండ్ చేసింది.

ఈ సమయంలో కొండా మురళి తన ఎమ్మెల్సీ పదవికి కూడ అర్ధాంతరంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. 2014 ఎన్నికలకు ముందు కొండా దంపతులు టీఆర్ఎస్‌లో చేరారు. 2014 ఎన్నికల్లో  వరంగల్ తూర్పు నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా కొండా సురేఖ పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఆ తర్వాత మురళి ఎమ్మెల్సీగా విజయం సాధించారు.

ఈ దఫా టీఆర్ఎస్ టిక్కెట్టు దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో కొండా దంపతులు చేరారు.  పరకాల నుండి కొండా సురేఖ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.కానీ, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 

సంబంధిత వార్తలు

స్వామిగౌడ్‌తో కొండా దంపతుల భేటీ: ఎమ్మెల్సీ పదవికి మురళి రాజీనామా

సండ్ర, మచ్చాలకు టీఆర్ఎస్ గాలం: పార్టీ మార్పుపై తేల్చేసిన ఎమ్మెల్యేలు

కేసీఆర్ దెబ్బ: నాడు టీడీపీ, నేడు కాంగ్రెస్ విల విల

రంగంలోకి ఉత్తమ్: ఆ నలుగురిపై వేటుకు కాంగ్రెస్ డిమాండ్

కేసీఆర్ షాక్: మండలిలో కాంగ్రెస్ఎల్పీ టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం

‘ఏపీలో స్పీకర్, ఛైర్మన్ చట్టాన్ని కాపాడుతున్నారు.. కానీ తెలంగాణలో’’

కేసీఆర్ ప్లాన్ ఇదే: మండలిలో కాంగ్రెస్ గల్లంతు

టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ శాసనమండలి ఎల్‌పీ వీలీనం..?

పార్లమెంట్‌ ఎన్నికలపై కేసీఆర్ దృష్టి: జనవరి నుండి ప్రచారం

పార్టీ అన్యాయం చేయలేదు.. బాబు ప్రచారం నచ్చలేదు: కాంగ్రెస్ ఎమ్మెల్సీలు

సీఎల్పీ మీటింగ్ జరగలేదు.. ఎవరు చేయిస్తున్నారో అందరికీ తెలుసు: ఉత్తమ్

 

Follow Us:
Download App:
  • android
  • ios