తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దాదాపు 1000కు పైగా దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిని స్క్రూటీని చేసందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. మురళీ ధరన్ నేరుగా అభ్యర్ధులతో టచ్‌లో వుంటున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో వుంది. ఉత్తరాదిన బీజేపీ జైత్రయాత్ర సాగిస్తుండగా.. దక్షిణాదిన మాత్రం సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. బలంగా వున్న తెలంగాణను ఎట్టి పరిస్ధితుల్లోనూ వదులుకోకూడదనే ఉద్దేశంతో టికెట్ల కోసం దరఖాస్తులు స్వీకరించింది. ఈ నెల 3న టీపీసీసీ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరగనుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధుల పూర్తి వివరాలను స్క్రీనింగ్ చేయనున్నారు . ఒక్కో పీఈసీ సభ్యుడితో స్క్రీనింగ్ కమిటీ మురళీధరన్, సభ్యులు వ్యక్తిగతంగా మాట్లాడనున్నారు. పీఈసీ ఎంపిక చేసిన లిస్టులోని అభ్యర్ధుల ప్రదర్శనపై ఆరా తీయనున్నారు.
పీఈసీ ఎంపిక చేసిన లిస్టును స్క్రీనింగ్ కమిటీ ఒకే చేయనున్నది. అనంతరం ఆ జాబితాను ఏఐసీసీకి పంపనున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా గాంధీ భవన్‌కు టికెట్ల కోసం దరఖాస్తులు రావడంతో పీఈసీకి ఇది పెద్ద టాస్క్‌గా మారింది. మరోవైపు.. ఈ నెల రెండో వారంలో షాద్ నగర్‌లో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించనుంది కాంగ్రెస్. ఇకపోతే.. పార్టీలో అంతర్గతంగా వున్న సమస్యలను పరిష్కరించేందుకు దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగారు. రేపు ఆయన హైదరాబాద్‌కు రానున్నారు. ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో డిగ్గీ రాజా భేటీ కానున్నారు. అనంతరం ఆయన మధ్యాహ్నం తిరిగి ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు.
Also Read : తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్.. రేపు హైదరాబాద్‌కు దిగ్విజయ్ సింగ్, నేతలతో వరుస భేటీలు
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నూతనంగా ఏర్పాటుచేసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్యూసి) మొదటి సమావేశం నిర్వహించాలని ఏఐసిసి నిర్ణయించింది. సెప్టెంబర్ 16న ఈ సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ భేటీకోసం కాంగ్రెస్ అధినాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఏఐసిసి అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే తో పాటు జాతీయస్థాయి కీలక నాయకులు హైదరాబాద్ రానున్నారు. ఈ భేటీలో పాల్గొనే నాయకులతో భారీ బహిరంగ సభకు కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని ఈ సభ ద్వారా ప్రారంభించాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
