మిస్టరీ : హైదరాబాద్ ఐఐటీ క్యాంపస్ నుంచి విద్యార్థి అదృశ్యం.. ఆరు రోజులుగా దొరకని ఆచూకీ...

సంగారెడ్డిలోని కందిలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ క్యాంపస్ నుంచి ఓ విద్యార్థి అదృశ్యం కలకలం రేపుతోంది. 

Second year student disappeared from IIT Hyderabad campus - bsb

హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్న ఐఐటీలో రెండో సంవత్సరం చుదువుతున్న కార్తీక్ అదృశ్యం కలకలం రేపుతోంది. అతను ఆరు రోజుల క్రితం క్యాంపస్ నుంచి వెళ్లాడు. ఇప్పటివరకు ఆచూకీ తెలియలేదు. ఈ నెల 17న కాలేజీ క్యాంపస్ నుంచి కార్తీక్ బైటికి వెళ్లాడు. అప్పటినుంచి ఆచూకీ లేదు.

18న తల్లిదండ్రులు కార్తీక్ కు ఫోన్ చేయగా సమాధానం రాలేదు. ఎన్నిసార్లు చేసినా అలాగే వస్తుండడంతో అనుమానంతో కాలేజీకి వచ్చారు. దీంతో విషయం వెలుగు చూసింది. నల్గొండ జిల్లా మిర్యాల గూడా కార్తీక్ స్వస్థలం. తల్లిదండ్రులు క్యాంపస్ కు వచ్చి చూడగా కార్తీక్ కనిపించడం లేదని తెలిసింది. 

స్వచ్చ సిద్దిపేట కోసం... మురికికాలువలో చేతితో చెత్తతీసిన మంత్రి హరీష్

దీంతో సంగారెడ్డి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే వారు దర్యాప్తు ప్రారంభించగా 17వ తేదీన క్యాంపస్ నుంచి వెళ్లినట్లుగా రికార్డయ్యింది. ఆ తరువాత ఎక్కడికి వెళ్లాడో తెలియలేదు. అయితే కార్తీక్ జన్మభూమి ఎక్స్ ప్రెస్ ఎక్కి విశాఖపట్నం బీచ్ లో తిరిగినట్టుగా సీసీ కెమెరాల్లో నమోదయ్యింది. బీచ్ పక్కనున్న బేకరీలో ఫుడ్ తిన్నట్టుగా కూడా గుర్తించారు. 

అక్కడినుంచి కార్తీక్ ఏమయ్యాడో అంతు చిక్కడం లేదు. బ్యాక్ లాగ్స్ ఉన్న కారణంగానే వెళ్లాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వైజాగ్ బీచ్ లోని అన్ని కెమెరాలు పరిశీలించారు. అయితే, రెండు కెెరాల్లోనే అతని ఆచూకీ దొరికింది. క్యాంపస్ నుంచి వెళ్లేముందు స్నేహితుల దగ్గర వంద, రెండొందలు అడిగి తీసుకున్నాడని తెలుస్తోంది. ఇప్పటికి దాదాపు ఆరు రోజులుగా విద్యార్థి ఆచూకీ దొరకకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios