స్వచ్చ సిద్దిపేట కోసం... మురికికాలువలో చేతితో చెత్తతీసిన మంత్రి హరీష్
తన సొంత నియోజకవర్గం సిద్దిపేట స్వచ్చత కోసం మంత్రి హరీష్ రావే స్వయంగా చెత్తను ఏరివేసారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Harish Rao
సిద్దిపేట : మన ఇంటినే కాదు చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా వుంచుకుంటే ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు నివారించవచ్చు. కాబట్టి ప్రతిఒక్కరు వారివారి పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకునేలా తెలంగాణ వైద్యారోగ్యశాఖ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మార్నింగ్ వాక్ చేస్తూనే చెత్తను ఏరివేయడం ద్వారా రెండురకాలుగా ఆరోగ్యాన్ని కాపాడుకొవచ్చంటూ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు.
Harish Rao
ఇవాళ ఉదయం సిద్దిపేట పట్టణంలో స్వయంగా మంత్రి హరీష్ తో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, బిఆర్ఎస్ నాయకులు ఓ బ్యాగ్ పట్టుకుని వాకింగ్ చేపట్టారు. వారు నడిచే దారిలో కనిపించిన పేరుకుపోయిన ప్లాస్టిక్ కవర్లు, వాటర్, ఛాయ్ గ్లాసులతో పాటు ఇతర చెత్తను ఎత్తి బ్యాగులో వేసుకుంటూ వేసుకుంటూ వెళ్లారు. స్వయంగా మంత్రి హరీష్ కూడా చెత్తనూ ఏరి బ్యాగులో వేసుకుంటూ ఈ స్వచ్చతా కార్యక్రమంలో పాల్గొన్నారు.
Harish Rao
ఈ సందర్భంగా పారిశుద్ద్య కార్మికులు బ్యానర్ పట్టుుకుని ముందునడవగా మంత్రి, ఇతర నాయకులు బ్యాగులు పట్టుకుని వెనక నడిచారు. ఇలా 18వ వార్డు వెంకటేశ్వర కళామందిర్ థియేటర్ నుంచి ర్యాలీగా వెళుతూ చెత్త ఏరివేతను ప్రారంభించారు. ఈ క్రమంలో మంత్రి హరీష్ కొన్ని ఇళ్లవద్ద ఆగి మహిళలకు చెత్త పేరుకుపోవడం వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు. చెత్తను తొలగించి స్వచ్చ, ఆరోగ్య సిద్దిపేటను తీర్చిదిద్దుకుందామని మంత్రి సూచించారు.
Harish Rao
వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ వంటి అంటువ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తుంటాయని... వాటి నివారణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని మంత్రి సూచించారు. ఇంటిపరిసరాలలో చెత్తాచెదారం పేరుకుపోయిన, వర్షపునీరు నిలిచినా దోమలు ఎక్కువ అవుతాయని... వాటివల్ల రోగాలు ప్రబలుతాయని హరీష్ అన్నారు. కాబట్టి ప్రతిఒక్కరు పరిసరాలను శుభ్రంగా వుంచుకోవాలని సిద్దిపేట వాసులకు మంత్రి హరీష్ రావు సూచించారు.