ఓ భార్య పట్ల భర్త దారుణంగా ప్రవర్తించాడు. మొదటి భార్యపై ఇష్టంతో రెండో భార్యను హతమార్చాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు మొదలుపెట్టారు.

అతడికి పదేళ్ల కిందట ఓ మహిళతో వివాహం అయ్యింది. ఓ కుమారుడు కూడా జన్మించాడు. చక్కగా సాగిపోతున్న కాపురం. ఇంతలో అతడికి మరో మహిళపై ఇష్టం పెరిగింది. ఉన్నట్టుండి ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో మొదటి భార్యకు అతడికి గొడవలు మొదలయ్యాయి. ఇలా తరచూ జరుగుతుండటంతో మొదటి భార్యను పొలానికి తీసుకెళ్లి పురుగుల మందు తాగించాడు. దీంతో ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. 

ప్రియుడిని కొట్టి, ప్రియురాలిపై గ్యాంగ్ రేప్.. పోలీస్ స్టేషన్ కు అంటూ తీసుకెళ్లి అఘాయిత్యం.. వీడియో తీసి మరీ..

బాధితురాలి తండ్రి, ‘సాక్షి’ కథనం ప్రకారం.. తిమ్మక్కపల్లి తండాలో కాట్రోత్ రమేష్ - స్వరూప (30) దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. ఈ జంటకు పది సంవత్సరాల కిందట పెద్దల సమక్షం వివాహం జరిగింది. అయితే రమేష్ కొంత కాలం కిందట సమీప గ్రామానికి చెందిన మరో మహిళపై ఇష్టం పెంచుకున్నాడు. అంతటితో ఆగకుండా ఇటీవల ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు. 

ఎన్నికల ఏడాదిలో ఈసీపై నియంత్రణ సాధించాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది - కాంగ్రెస్

ఈ విషయం తెలియడంతో మొదటి భార్య స్వరూప షాక్ అయ్యింది. భర్తను నిలదీసింది. ఇక అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య చాలా సార్లు గొడవలు జరుగుతున్నాయి. అతడికి రెండో భార్యపై ఉన్న మోజు.. మొదటి భార్యపై కోపం పెంచేలా చేశాయి. ఇటీవల వాగ్వాదాలు ఎక్కువ కావడంతో ఆమెను చంపేయాలని ఓ ప్లాన్ వేశాడు.

అందులో భాగంగానే ఈ నెల 6వ తేదీన ఆదివారం పొలానికి వెళ్లి వద్దామని రమేష్ స్వరూపకు చెప్పాడు. భర్త మాటలు నమ్మి అతడితో పాటు ఆమె వెళ్లింది. అంతకు ముందే రమేష్ పొలంలో పురుగుల మందు డబ్బా పెట్టి ఉంచాడు. దానిని తీసుకొచ్చి, తాగాలని భార్యను బలవంతం చేశాడు. ఎట్టకేలకు ఆమెతో తాగించాడు. కొంత సమయం తరువాత స్వరూప అపస్మారక స్థితికి చేరుకుంది. 

పాదచారిని ఢీకొట్టిన కారు.. నాలాలో పడి చనిపోయిన బాధితుడు.. 36 గంటల తరువాత మృతదేహం బయటకు..

తరువాత కౌడిపల్లి మండలం మహబూబ్‌నగర్‌ తండాలో ఉండే భార్య తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. స్వరూప పురుగుల మందు తాగిందని వారికి వివరించాడు. తరువాత ఆమెను మెదక్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు చికిత్స కోసం తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు స్వరూపను హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ కు తీసుకొచ్చారు. 

రాహుల్ గాంధీని సస్పెండ్ చేశారు.. మరి బండి సంజయ్ పై ఏం చర్యలు తీసుకుంటారు- లోక్ సభ స్పీకర్ కు కేటీఆర్ ప్రశ్న..

అయితే అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో స్వరూప పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి చనిపోయింది. తన కూతురు స్వరూపను అల్లుడు రమేష్, రెండో భార్య వేధింపులకు గురి చేశారని ఆరోపిస్తూ బాధితురాలి తల్లి, తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై గురువారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.