ఏసీబీకి చిక్కిన ఎస్ఈ జగజ్యోతి.. ఇంట్లో రూ.65 లక్షలు, 2.5 కేజీల బంగారం లభ్యం.. కన్నీటి పర్యంతం
గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ విభాగం ఎస్ ఈ కె.జగజ్యోతి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అనంతరం ఆమె ఇంట్లో అధికారులు సోదాలు జరపగా.. రూ.65 లక్షలు, 2.5 కిలోల బంగారం లభించింది. కాగా.. ఆమె అధికారులకు చిక్కిన వెంటనే కన్నీటి పర్యంతమయ్యారు.
హైదరాబాద్ లోని గిరిజన భవన్ లో గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ విభాగం ఎస్ ఈ కె.జగజ్యోతి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. తన కార్యాలయంలో నిజామాబాద్ లోని నామ్ దేవ్ వాడకు చెందిన లైసెన్స్ డ్ కాంట్రాక్టర్ బోడుకం గంగన్న నుంచి రూ.84 వేలు లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
Mystery : శివపురి అడవిలో వందలాది ఆవుల మృతదేహాలు.. అసలేం జరిగింది..?
ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంట్రాక్టర్ గంగన్న నిజామాబాద్ లో చేసిన పనికి బిల్లులు మంజూరు అయ్యాయి. అయితే గాజుల రామారంలో నిర్వహిస్తున్న జువెనైల్ బాయ్స్ హాస్టల్ భవన నిర్మాణం కాంట్రాక్ట్ కూడా ఆయనకే దక్కింది. నిజమాబాద్ పనికి బిల్లులు వచ్చినా, గాజుల రామారంలోని పనికి అంచనాలు సవరించేందుకు ఎస్ఈ లంచం అడిగారు.
ఒకే ఎన్‌క్లోజర్‌లోకి అక్బర్, సీతా పేరున్న మగ, ఆడ సింహం.. కోర్టును ఆశ్రయించిన వీహెచ్ పీ
దీంతో ఆ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన అధికారులు ఆమె ఆఫీసులో రూ.84 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తరువాత ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు. అందులో రూ.65 లక్షల నగదు, 2.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
కాగా.. ఎస్ జగజ్యోతి ఏసీబీ అధికారులకు పట్టుబడగానే కన్నీటి పర్యంతమయ్యారు. అయితే ఇటీవలి కాలంలో ఓ ఇంజనీర్ నుంచి రికవరీ అయిన భారీ మొత్తం ఇదే. ఆమెపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచారు.