Mystery : శివపురి అడవిలో వందలాది ఆవుల మృతదేహాలు.. అసలేం జరిగింది..?
అడవి మధ్యలో వందలాది ఆవులు చనిపోయాయి. జాతీయ రహదారికి 500-600 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. (The bodies of hundreds of cows were found in the Shivpuri forest in Madhya Pradesh) ఒకే ప్రాంతంలో ఇంత పెద్ద మొత్తంలో మూగ జీవాలు ఇలా మృత్యువాత పడటం, వాటి మరణానికి గత కారణాలు ఏంటనే విషయం తెలియకపోడం మిస్టరీగా మారింది.
Mystery : అదో అటవీ ప్రాంతం. గ్రామానికి చాలా దూరంలో ఉండే ఆ అడవిలో మనుషులెవరూ పెద్దగా తిరగరు. జంతువులు, క్రూర మృగాలు సంచరిస్తుటాయి. అప్పుడప్పుడు పశుగ్రాసం కోసం ఆవులు మేతకు వెళ్తుంటాయి. మళ్లీ తిరిగి ఇంటికి వచ్చేస్తుంటాయి. అయితే ఇటీవల అక్కడ వందలాది ఆవుల మృతదేహాలు లభ్యం అయ్యాయి. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేకెత్తించింది.
అయోధ్య రాములోరికి తిరుమల వెంకన్న సాయం..
మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాలో వందలాది ఆవుల మృతదేహాలు లభ్యమైన ఓ మిస్టరీ విషయం వెలుగులోకి వచ్చింది. దాదాపు 200 కంటే ఎక్కువ ఆవుల శవాలు అడవి మధ్యలో కనిపించాయి. శివపురి జిల్లాలోని 27వ నెంబరు జాతీయ రహదారిపై కరైరా తహసీల్ గుండా సాలార్ పూర్ వెళ్లే రోడ్డులో జాతీయ రహదారికి కేవలం 500-600 మీటర్ల దూరంలో ఈ మృతదేహాలను గుర్తించారు. అయితే అవి ఎందుకు అలా చనిపోయాయో ఇంకా ఎవరికీ అంతుపట్టడం లేదు.
ఒకే ఎన్‌క్లోజర్‌లోకి అక్బర్, సీతా పేరున్న మగ, ఆడ సింహం.. కోర్టును ఆశ్రయించిన వీహెచ్ పీ
ఈ విషయంపై పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ సురేష్ శర్మ ‘ఇండియా టీవీ’తో మాట్లాడుతూ.. అడవి మధ్యలో ఆవుల మృతదేహాలు ఉన్నట్టు తనకు సమాచారం వచ్చిందని తెలిపారు. దీంతో తాను వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించానని చెప్పారు. అయితే ఈ ఘటనకు గల కారణాలను కనుగొనలేకపోయానని తెలిపారు. కాగా.. ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ వ్యవహారంపై అటవీశాఖ మౌనంగా ఉంది.
చనిపోయిన జంతువులను ఈ ప్రాంతంలో పడేస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మించిన గోశాలల్లో మరణాలు సంభవించడంతో పశువులను ఇక్కడ పడేశారని మరి కొందరు చెబుతున్నారు. ప్రస్తుతం చుట్టుపక్కల కూడా ఈ విషయంలో ఏమీ మాట్లాడటం లేదు.
వెల్లుల్లి కిలో రూ.500.. పంట పొలాల్లో సీసీ కెమెరాలతో రైతుల పహారా..
అటవీ ప్రాంతంలో ఇంత భారీ స్థాయిలో పశువుల శవాలు లభ్యమవడం, వాటి మరణానికి కారణం తెలియకపోవడం ఇదే తొలిసారి. వాటిపై ఏ క్రూర జంతువైనా దాడి చేసిందా ? లేక వాటిపై విష ప్రయోగం జరిగిందా ఇంకా తెలియరావడం లేదు. ఆ ఆవుల యజమానులు ఎవరు ? ఇంత కాలం ఆవులు కనిపించకుండా పోయినా వారు ఎందుకు వెతకలేదు అనే విషయంపై ఇంకా స్పష్టత రావడం లేదు.