Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ రైతు బంధుకు కోత... గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తి కర వ్యాఖ్యలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు బంధు పథకం గురించి శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  

gutta sukhender reddy controversial comments on rhythu bandhu
Author
Nalgonda, First Published Jan 3, 2020, 8:53 PM IST

రైతు బంధు పథకానికి కొన్ని ఆంక్షలు అమలు చేయాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శాసనమండలిలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ముచ్చటించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రైతు బంధు పథకం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఈ పథకం అమలుతో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. రైతులందరికీ ఈ పథకాన్ని అమలు చేయకుండా 10 ఎకరాల సీలింగ్ అమలు చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అది కూడా సాగు చేస్తున్న రైతులకు మాత్రమే పథకం ద్వారా లబ్ధిదారులుగా ఎంపిక చేస్తే నిజమైన రైతులకు లబ్ది చేకూరుతుందన్నారు. 

read more  చేతులెత్తేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి: రేసులో ఉన్నది వీరే...

గత అసెంబ్లీ ఎన్నికల కు ముందు తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎకరాకు 4వేల రూపాయలు ముందుగా ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఎకరాకు ఏటా రెండు విడుతాలుగా 5 వేల రూపాయలను అందిస్తోంది.

శాసన సభ, శాసన మండలి లు ప్రస్తుతం వేరువేరుగా భవనాల్లో జరుగుతున్నా త్వరలో ఒకే ప్రాంగణంలో కి మారే అవకాశం ఉందన్నారు.  ఏపీ అసెంబ్లీ భవనాన్ని శాసనమండలి కేటాయించే అవకాశం ఉందన్నారు. మరమ్మతుల అనంతరం మండలి కూడా అక్కడికి మారే అవకాశం ఉందన్నారు.

read more  అసద్‌ను నిజామాబాద్‌లో క్రేన్‌కు వేలాడదీస్తా: బీజేపీ ఎంపీ అరవింద్ సంచలనం

Follow Us:
Download App:
  • android
  • ios