ప్రశాంత్ కిశోర్‌ అతిగా ఊహించుకుంటున్నారు.. టీఆర్‌ఎస్‌తో మాది కొట్లాటే : తేల్చేసిన జగ్గారెడ్డి

ఇటీవల కాంగ్రెస్ (congress) నేత రాహుల్‌ గాంధీపై (rahul gandhi) తీవ్ర విమర్శలు చేసిన ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌పై (prashant kishor) సంగారెడ్డి ఎమ్మెల్యే (sangareddy mla) జగ్గారెడ్డి (jagga reddy) మండిపడ్డారు. రాహుల్‌పై ప్రశాంత్‌కిషోర్ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత్‌ తనకు తాను అతిగా ఊహించుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

sangareddy congress mla counter to prashant kishor over his remarks on rahul gandhi

ఇటీవల కాంగ్రెస్ (congress) నేత రాహుల్‌ గాంధీపై (rahul gandhi) తీవ్ర విమర్శలు చేసిన ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌పై (prashant kishor) సంగారెడ్డి ఎమ్మెల్యే (sangareddy mla) జగ్గారెడ్డి (jagga reddy) మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా హాల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్‌పై ప్రశాంత్‌కిషోర్ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత్‌ తనకు తాను అతిగా ఊహించుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ లేకుండా బీజేపీని (bjp) ఓడించడం మిగతా పార్టీలకు కలగానే ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మమత (mamata banerjee), కేసీఆర్‌కు (kcr) వంద పార్లమెంట్ స్థానాలు వచ్చే అవకాశం ఉందా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌ మధ్యే పోటీ ఉంటుందన్న ఆయన.. బీజేపీది థర్డ్ ప్లేసేనని స్పష్టం చేశారు. 

ఎవరితో కలిసి పని చేయాలి అనేది ఢిల్లీలోనే నిర్ణయిస్తామని.. సోనియా, రాహుల్ నిర్ణయమే ఫైనల్ అని జగ్గారెడ్డి తేల్చిచెప్పారు. 230 ఓట్లున్న మమ్మల్ని చూసి టీఆర్ఎస్ పార్టీ భయపడుతోందని.. అందుకే ఫిర్యాదు లు చేస్తుందని ఆయన మండిపడ్డారు. 300 మందిని నార్త్ ఇండియా టూర్ పంపింది ఎవరు అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. 100 మందిని తిరుపతి తీసుకెళ్ళి దర్శనం చేయిస్తున్నారని.. మీ పార్టీ ప్రజాప్రతినిధులకు దేవుడి దర్శనం చేస్తున్నందుకు ఆయన థ్యాంక్స్ చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులను టీఆర్ఎస్ క్యాంప్‌లకు తరలిస్తుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కొప్పుల మంత్రిగా (koppula eshwar) ఉండి ఓ కులాన్ని కించపరిచారని.. దీనిపై ఎన్నికల కమిషన్ (election commission) ఏం చర్యలు తీసుకుందంటూ ఆయన మాట్లాడిన ఆడియోను జగ్గారెడ్డి మీడియా ప్రతినిధులకు వినిపించారు. 

Also Read:ఆ పార్టీకి విప‌క్షాల‌కు నాయకత్వం వ‌హించే హ‌క్కులేదు.. ప్రశాంత్ కిశోర్ హాట్ కామెంట్స్..

అంతకుముందు టీఆర్ఎస్ నేతలు  Srinivas Reddy, Bharat లు బుద్ధభవన్ లో సీఈఓ శశాంక్ గోయల్ ని కలిశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పై ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో ఎంపిటిసి, జెడ్పిటిసీలను ప్రలోభ పెడుతున్నారని పిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే నజరానా అంటూ జగ్గారెడ్డి ఓటర్లకు ఫోన్లు చేసారని ఆరోపించారు. ఈ సందర్భంగా  టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్సి ఎన్నికలు వచ్చాయి. కొన్ని పార్టీలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. గెలుపే లక్ష్యంగా వారు ప్రయత్నాలు చేస్తున్నారు’ అని అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios