Asianet News TeluguAsianet News Telugu

ఆ పార్టీకి విప‌క్షాల‌కు నాయకత్వం వ‌హించే హ‌క్కులేదు.. ప్రశాంత్ కిశోర్ హాట్ కామెంట్స్..

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.  గడిచిన ప దేళ్లలో కాంగ్రెస్ పార్టీ 90శాతం ఎన్నిక ల్లో ఓటమి పాలైన నేపథ్యంలో ఆ పార్టీ నాయక త్వం ఓ వ్యక్తికి దైవహక్కు కాదని ప్రశాంత్ కిషోర్ పరోక్షంగా రాహుల్ ను ఉద్దేశించి ట్వీట్  చేశారు.
 

Prashant Kishor says Congress leadership not divine right of individual
Author
Hyderabad, First Published Dec 2, 2021, 8:27 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

దేశ రాజకీయాలు రోజుకో మ‌లుపు తిరుగుతున్నాయి. గ‌త కొద్ది రోజుల కిత్రం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor)  కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడంటూ పెద్ద ఎత్తున‌.. ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా తాను రాజ‌కీయాల‌కు దూరంగా ఉండ‌బోతున్న‌న‌నీ, ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండ‌బోతున్న‌ట్టు ప్రశాంత్ కిశోర్ యూటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. 

ఆ తర్వాత నుంచి ప్రశాంత్ కిశోర్..త‌రుచూ కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తూ కామెంట్స్ చేస్తున్న విష‌యం తెలిసిందే.  తాజాగా.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi)  పై నేరుగా సంచలన వ్యాఖ్యలు చేశారు.  రాహుల్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ ను విపక్ష‌ల‌కు నాయక‌త్వం వ‌హించే అర్హ‌త లేద‌నీ, ఆ పార్టీ నాయకత్వమనేది దైవదత్త హక్కు కాదని ఘ‌టూగా కామెంట్ చేశారు. ప్రతిపక్ష నేతను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవాల‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  

read also:https://telugu.asianetnews.com/national/rahul-gandhi-meeting-with-party-leaders-over-prashanth-kishor-joining-in-congress-qx1ch3

ప్రశాంత్ కిశోర్ త‌న  ట్విట్ట‌ర్ లో..  ప్రతిపక్షాల‌కు ప్రాతినిధ్యం వహించాలంటే.. బ‌ల‌వంత‌మైన నాయ‌క‌త్వం అవ‌సరం.  విపక్షాలకు నాయకత్వం వహించడం దేవుడిచ్చిన హక్కుగా కాంగ్రెస్ భావిస్తుంది. కానీ విపక్షాలకు నాయకత్వం వహించే హక్కు కాంగ్రెస్ కు లేదు. మరీ ముఖ్యంగా గడచిన పదేండ్లలో  90 శాతం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకత్వాన్ని ప్రజాస్వామ్య బద్ధంగా నిర్ణయించాలి అంటూ ప్రశాంత్‌ కిశోర్‌ ట్విట్‌ చేశారు.

ఇదిలాఉంటే.. మమత బెనర్జీ బుధవారం ఓ ముంబాయిలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆమె  మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఎక్కడుందని ప్రశ్నించారు. యూపీఏ ఉనికిలో లేదన్నారు. రాహుల్ గాంధీని విమ‌ర్శించారు. రాహుల్ గాంధీ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నించకుండా..  విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ..
ఎంజాయ్ చేస్తున్నార‌ని దుయ్యబట్టారు. సగం కాలం విదేశాల్లో ఉంటూ ఎవరూ రాజకీయాలు చేయలేరన్నారు.  ఇలా బెంగాల్  సీఎం మమతాబెనర్జీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మరుసటిరోజే ..  ప్రశాంత్  కిషోర్ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయడం చ‌ర్చ‌నీయంగా మారాయి.

read also: https://telugu.asianetnews.com/national/prashant-kishor-attacks-centre-s-unlock-1-covid-plan-forecasts-catastrophe-once-again-qb8p54

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ త‌రుపున ప్ర‌శాంత్ కిశోర్ ప్రచార వ్యూహాక‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే.  అప్ప‌టి నుంచి మమత బెనర్జీతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు ప్ర‌శాంత్ కిశోర్. తాజా దీదీ మాట‌ల‌కు అనుకునంగా..  రాహుల్ గాంధీపై తరచూ విరుచుకుపడుటం గ‌మ‌నార్హం. 

ప్ర‌శాంత్ కిషోర్ వ్యాఖ్య‌లపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్  ఖేరా  తీవ్రంగా స్పందించింది. ఆర్ ఎస్ ఎస్ నుంచి  దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం. ఓ వ్యక్తి తన దైవహక్కుగా భావిస్తున్నారంటూ పరోక్షంగా ప్రశాంత్  కిషోర్ ను విమ‌ర్శించారు. సైద్ధాంతిక నిబద్ధత లేని వృత్తి నిపుణుడు ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలనే విషయమై ఉచిత సలహాలు ఎన్నైనా ఇవ్వొచ్చు కానీ రాజకీయ అజెండాను నిర్దేశించలేరని పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్  సీనియర్  నేత కపిల్ సిబ‌ల్ కూడా త‌న పీకే వ్యాక్యాలను ఖండించారు.  కాంగ్రెస్  లేని యూపీఏ ఆత్మలేని శరీరం వంటిదన్నారు. 

 ఇదిలాఉంటే..  ప్రశాంత్‌ కిషోర్ వ్యాఖ్య‌లు హ‌స్తినా రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌నాలు సృష్టిస్తున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్‌, గోవా ఎన్నికల నేప‌థ్యం పీకే వ్యాఖ్య‌లు కాంగ్రెస్ కు నష్టం చేకూర్చేవిగా మారుతాయని పలువురు రాజకీయ ప్రముఖులు పేర్కొంటున్నారు. టీఎంసీని గోవా, మిజోరాం తదితర రాష్ట్రాలకు విస్తరించే వ్యూహాలను ప్రశాంత్ కిశోర్ రూపొందిస్తున్నారు.  


 

Follow Us:
Download App:
  • android
  • ios