రేపటిలోపుగా వలస కూలీలకు జీతాలు చెల్లించాలి: కాంట్రాక్టర్‌కు కలెక్టర్ ఆదేశం

కందిలో ఉన్న వలస కూలీలకు ఈ నెల 30వ తేదీలోపుగా వేతనాలు చెల్లించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు  కాంట్రాక్టర్ ను ఆదేశించారు. తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరుతూ వలస కూలీలు బుధవారం నాడు ఉదయం ఆందోళనకు దిగారు.

Sangareddy collector orders contractor to pay salaries migrant workers

సంగారెడ్డి: కందిలో ఉన్న వలస కూలీలకు ఈ నెల 30వ తేదీలోపుగా వేతనాలు చెల్లించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు  కాంట్రాక్టర్ ను ఆదేశించారు. తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరుతూ వలస కూలీలు బుధవారం నాడు ఉదయం ఆందోళనకు దిగారు. పోలీసులపై వలస కూలీలు పోలీసులపై దాడికి దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే.

వలస కూలీలు పోలీసులపై దాడి చేసిన  విషయం తెలుసుకొన్న కలెక్టర్, జిల్లా ఎస్పీ, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు కంది ఐఐటీ వద్దకు చేరుకొన్నారు. వలస కార్మికులతో చర్చించారు.

కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులు, వలస కూలీలతో చర్చించారు. రేపటి లోపుగా వలస కూలీలకు రెండు మాసాల వేతనాలు చెల్లించాలని కలెక్టర్ హనుమంతరావు కాంట్రాక్టర్ ను ఆదేశించారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు.

also read:కంది ఐఐటీ వద్ద పోలీసులపై వలస కార్మికుల దాడి, ఉద్రిక్తత

కంది ఐఐటీ క్యాంప్ లో ఆరు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు 2400 ఉన్నారు. రెండు మాసాలుగా తమకు వేతనాలు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. వేతనాలు చెల్లించాలని కలెక్టర్ ఆదేశించడంతో కార్మికులు శాంతించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios