Asianet News TeluguAsianet News Telugu

కంది ఐఐటీ వద్ద పోలీసులపై వలస కార్మికుల దాడి, ఉద్రిక్తత

 హైద్రాబాద్ కు సమీపంలోని కంది ఐఐటీ క్యాంప్ లో ఉన్న వలస కార్మికులు బుధవారం నాడు పోలీసులపై దాడికి దిగారు. తమను తమ స్వగ్రామాలకు పంపాలని వారు డిమాండ్ చేశారు. 

Tension prevails at Kandi IIT in Sangareddy District
Author
Sangareddy, First Published Apr 29, 2020, 12:52 PM IST


హైదరాబాద్: హైద్రాబాద్ కు సమీపంలోని కంది ఐఐటీ క్యాంప్ లో ఉన్న వలస కార్మికులు బుధవారం నాడు పోలీసులపై దాడికి దిగారు. తమను తమ స్వగ్రామాలకు పంపాలని వారు డిమాండ్ చేశారు. తాము తమ గ్రామాలకు వెళ్లామని రోడ్డుపైకి వచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని నిలువరించారు. దీంతో పోలీసులపై వారు దాడికి దిగారు.దీంతో ఉద్రిక్తత నెలకొంది.

హైద్రాబాద్ కు సమీపంలోని కందిలో ఐఐటీ భవనాల సముదాయాన్ని నిర్మాణ పనుల్లో ఇతర రాష్ట్రాల నుండి  వందలాది కూలీలు వచ్చారు. లాక్‌డౌన్ నేపథ్యంలో నెల రోజులుగా కూలీలకు పనులు లేవు.

కంది ఐఐటీ క్యాంపులోనే సుమారు వెయ్యి మంది కార్మికులు ఉన్నారు. నెల రోజులుగా కార్మికులు ఇదే క్యాంపులో ఉంటున్నారు. ఒకే గదిలో 16 మంది ఉంటున్నారు. పనులు లేకపోవడంతో తమ వద్ద డబ్బులు కూడ లేవని వలసకూలీలు ఆందోళన చెందుతున్నారు. దీంతో తాము తమ గ్రామాలకు వెళ్తామని చెప్పారు.

also read: ఏప్రిల్ 30 నుండి తెలంగాణలో బంద్: లారీ అసోసియేషన్ హెచ్చరిక

తమ గ్రామాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని క్యాంప్ లోకి వెళ్లాలని కోరారు. పోలీసులతో వలసకూలీలు వాదనకు దిగారు. పోలీసులపై వలసకూలీలు దాడికి దిగారు. పోలీసుల వాహనంపై రాళ్లతో దాడికి దిగారు. పోలీసు వాహనం ధ్వంసమైంది.

రాళ్లు, కర్రలతో పోలీసులపై దాడికి యత్నించారు. కొందరు పోలీసులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకొన్న వెంటనే ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొన్నారు.

వలస కూలీలకు నచ్చజెప్పేందుకు పోలీసు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. వలసకూలీలు, పోలీసులపై దాడితో కంది ఐఐటీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios