సమంత ను తెలంగాణ రాష్ట్ర చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించలేదని , అసలు ఆమెకు ప్రభుత్వం తరఫున పైసా కూడా ఇవ్వలేదని చాలా స్పష్టంగా బదులిచ్చారు.
మాటలతో కోటలు కట్టడంలో సీఎం కేసీఆర్ ను మించిపోతున్నారు ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్.మూడేళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఇప్పుడిప్పుడే ఈ విషయం అర్థమవుతోంది. హీరోయిన్ సమంతకు కూడా ఇప్పుడు అర్థమై ఉంటుంది.
మంత్రి కేటీఆర్ ఇటీవల సమంతను తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు ట్విటర్ లో ప్రకటించిన విషయం తెలిసిందే.తెలంగాణలో ఎంతో మంది ఉండగా ఆమెనే ఎందుకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు అని కొందరు అప్పట్లో ప్రశ్నలు కూడా లేవనెత్తారు.
అసలే బ్రాండ్ అండాసిడర్ అంటే బోలెడు డబ్బులు కురిపించే సర్కారు ఈమెకు ఎంత ముట్టజెప్పారో అని కొంతమంది నసిగారు కూడా.అయితే సమంతకు అంత సీన్ లేదట. ఇటీవల చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఆమె పలు ప్రాంతాల్లో కూడా పర్యటించారు. చేనేతకు చేయూనిస్తానని పదే పదే ప్రకటించారు.
అయితే ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటంపై డౌట్ వచ్చిన చేనేత వర్గాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు చిక్కా దేవదాసు ఆర్టీఐ కింద ప్రభుత్వానికి ఓ దరఖాస్తు చేశారు.
దీనిపై స్పందించిన ప్రభుత్వం.. సమంత ను తెలంగాణ రాష్ట్ర చేనేత బ్రాండ్ అంబాసిడర్గా నియమించలేదని , అసలు ఆమెకు ప్రభుత్వం తరఫున పైసా కూడా ఇవ్వలేదని చాలా స్పష్టంగా బదులిచ్చారు.
