Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ కూకట్ పల్లిలో సెలూన్ యజమాని దారుణహత్య...

గుర్తు తెలియని దుండగులు ఓ సెలూన్ యజమానిని దారుణంగా హతమార్చారు. సెలూన్ లోని సీసీ కెమెరాలు ధ్వంసం చేసి మరి దారుణానికి ఒడిగట్టారు. 

Salon owner brutally murdered in KukatPally, Hyderabad - bsb
Author
First Published Oct 16, 2023, 8:13 AM IST

హైదరాబాద్ : హైదరాబాద్ కూకట్ పల్లిలో దారుణ హత్య వెలుగు చూసింది. కూకట్ పల్లి పాపారావునగర్ లోని ఓ సెలూన్ ఓనర్ అశోక్ హత్యకు గురయ్యాడు. అర్థరాత్రి అయినా అశోక్ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. దీంతో కంగారుతో సెలూన్ కు వచ్చి చూశారు. సెలూన్ షెట్టర్ పైకి లేపగానే అవోక్ దారుణంగా హతమార్చబడి కనిపించాడు. 

వెంటనే షాక్ అయిన కుటుంబసభ్యులు వెంటనే సీసీ కెమెరాలో పరిశీలించగా.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి కనిపించాయి. ధ్వంసం చేసి, హతమార్చి దుండగులు పారిపోయారు. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం, పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios