మరుగుజ్జు శివలాల్ కు సజ్జనార్ ప్రశంసలు... ఎందుకంటే...
బంజారాహిల్స్ లో నివసించే శివలాల్ తన ఎత్తకు సరిపడి కారు క్లచ్, బ్రేకులు ఏర్పాటు చేసుకుని మూడు నెలల పాటు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. అధికారులను ఒప్పించి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం అభినందనీయం అని సజ్జనార్ అన్నారు. లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్న శివలాల్ భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టించాలని కోరారు.
బంజారాహిల్స్ : అంకితభావం, అకుంఠిత దీక్ష, ఆత్మవిశ్వాసంతో డ్రైవింగ్ నేర్చుకుని Telangana Transport Department నుంచి Driving Licence పొందిన మొట్టమొదటి dwarfగా రికార్డు సృష్టించిన డాక్టర్ శివలాల్ ను టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మంగళవారం శాలువా, పుష్పగుచ్చంతో సత్కరించారు. శివలాల్ ప్రతీ ఒక్కరికి స్పూర్తి దాయకంగా, రోల్ మాడల్ గా నిలుస్తారని ఆయన పేర్కొన్నారు.
బంజారాహిల్స్ లో నివసించే శివలాల్ తన ఎత్తకు సరిపడి కారు క్లచ్, బ్రేకులు ఏర్పాటు చేసుకుని మూడు నెలల పాటు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. అధికారులను ఒప్పించి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం అభినందనీయం అని సజ్జనార్ అన్నారు. లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్న శివలాల్ భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టించాలని కోరారు. ఈ మేరకు ఆయన శివలాల్ ప్రతిభను కొనియాడుతూ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా, జనవరి 12న అర్ధరాత్రి TSRTC కి ట్వీట్ ఓ యువతి ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కు RTC MD vc sajjanar వెంటనే స్పందించారు. అర్ధరాత్రి సమయాలలో RTC బస్సులలో మహిళల సౌకర్యం కోసం ( వాష్ రూమ్స్ ) బస్సులను పెట్రోల్ పంప్ లలో 10 నిమిషాలు బస్సు ఆపాలని పాలే నిషా అనే యువతి కోరింది.
washroomల దగ్గర ఆపకపోవడంతో.. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే మహిళలు ఇబ్బందులు పడుతున్నారని యువతి తెలిపింది. అయితే ఆమె tweet చేసిన వెంటనే ఆ ట్వీట్ కు ఎండి సజ్జనార్ రీట్వీట్ చేశారు. ఇలా వెంటనే అర్ధరాత్రి చేసిన ట్వీట్ కి ఆర్టీసీ ఎండి సజ్జనార్ స్పందించడం విశేషంగా మారింది.
మహిళలకు కలుగుతున్న ఈ అసౌకర్యంపై అధికారులకు సూచించినట్లు సజ్జనార్ retweet చేశారు. అర్ధరాత్రి సైతం మహిళల సమస్యపై సజ్జనార్ స్పందించడంతో పాలే నిషా అనే ఆ యువతి ఆనందం వ్యక్తం చేసి, కృతజ్ఞతలు తెలిపింది
ఇదిలా ఉండగా, టీఎస్ ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆ సంస్థలో మార్పులు మొదలయ్యాయి. ప్రతీ విషయంలోనూ ఆయన మార్క్ నిర్ణయాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే మహిళ సిబ్బందికి రాత్రి 8 దాటిన తరువాత డ్యూటీలు వేయడం నిషేదించారు. మౌఖికంగా చెప్పిన తరువాత ఆ ఆదేశాలు అమలు కాలేదు. ఈ విషయం ఆయన దృష్టికి వచ్చిన వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు.
దీంతో రాత్రి సమయంలో కండక్టర్ గా విధులు నిర్వహించే మహిళల ఇబ్బందులు తొలగిపోయాయి. అలాగే హైదరాబాద్ పరిధిలో క్రిస్మస్, డిసెంబర్ 31 రాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపేలా నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1వ తేదీ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా చిన్నారులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఎండీ సజ్జనార్... ఆ వేదిక ద్వారా తన దృష్టికి వచ్చే అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నారు. ప్రతీ సారి దసరా సమయంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సుల పేరుతో ఛార్జీలు పెంచుతూ వస్తోంది. అయితే ఈ సారి మాత్రం అలా జరగలేదు. అలాగే రూల్స్ పాటించని అధికారుల విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటున్నారు సజ్జనార్. ఇటీవల ఆర్టీసీ బస్సులో జన్మించిన ఇద్దరికీ జీవితాంతం బస్ ఫ్రీగా ఇచ్చారు.