హైదరాబాద్: మజ్లిస్ పార్టీ కీలక నేత, చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సైదాబాద్ పోలీసులను ఆదేశించింది నాంపల్లి కోర్టు. కోర్టు ఆదేశాలతో సైదాబాద్ పోలీసులు అక్బరుద్దీన్ ఓవైసీపీపై కేసు నమోదు చేశారు. ఈ ఏడాది జూలై 24న కరీనంగర్ లో ఎన్ఎన్ గార్డెన్స్ లో జరిగిన ఎంఐఎం పార్టీ కార్యకర్తల సమావేశంలో అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. 

అక్బరుద్దీన్ వ్యాఖ్యలు ఒక వర్గాన్ని కించపరిచేలా ఉండటంతోపాటు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ హైదరాబాద్ కు చెందిన న్యాయవాది కాశింశెట్టి కరుణాసాగర్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. 

విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై క్రిమినల్ కేసులు పెట్టాలంటూ ఆదేశించింది. దాంతో సైదాబాద్ పీఎస్ లో అక్బరుద్దీన్ పై సెక్షన్ 153, 153(ఏ),153(బి), 506ల కింద కేసు నమోదు చేశారు. 

ఇకపోతే జూలై 24న కరీనంగర్ లో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్ని రోజులు బతుకుతానో తనకే తెలియదని తాను భయపడేది తన గురించి కాదని రాబోయే తరాల గురించేనని చెప్పుకొచ్చారు.  

కరీంనగర్‌లో ఎంఐఎం నేత డిప్యూటీ మేయర్‌గా ఉన్నప్పుడు స్థానికంగా బీజేపీ అడ్రస్‌ కూడా లేకుండా పోయిందని కానీ ఈనాడు ఏకంగా కరీంనగర్‌ ఎంపీ స్థానాన్ని గెలుచుకుందన్నారు. మజ్లిస్‌ గెలవలేదని బాధలేదు గానీ బీజేపీ గెలిచిందని ఆవేదనగా ఉందన్నారు. 

మూక దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారు నేరుగా స్వర్గానికి వెళ్తారు. ఎవరైతే భయపెడతారో వారినే భయపెట్టిస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్‌ మతతత్వ పార్టీ అని దుష్ప్రచారం చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీపై విమర్శలు చేసేవారు ఎవరో కాదని గాడ్సేని పొగిడినవాళ్లేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గమ్యాన్ని ముద్దాడే భావోద్వేగాలంటే తనకు ఇష్టమన్నారు అక్బరుద్దీన్ ఓవైసీ.  

అలాగే గతంలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మళ్లీ గుర్తు చేశారు. 15 నిమిషాలు వదిలిపెట్టండి. హిందూ, ముస్లిం జనాభా నిష్పత్తిని సమానం చేస్తా అంటూ గతంలో చేసిన వ్యాఖ్యలను మళ్లీ చేయడంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ దేశ సార్వభౌమత్వాన్ని అక్బరుద్దీన్ సవాల్ చేశారంటూ మండిపడుతున్న సంగతి తెలిసిందే. 

ఈ వార్తలు కూడా చదవండి

అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు : కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు

అక్బరుద్దీన్ ఓవైసీకి ఐపీఎస్ అధికారి క్లీన్ చిట్

కొందరు కావాలని చేస్తున్నారు... చట్టాన్ని ఉల్లంఘించలేదన్న అక్బరుద్దీన్