ఖమ్మం: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే కొందరు ఆర్టీసీ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడగా తాజాగా మరో కార్మికురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న నీరజ అనే మహిళ తన ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు విడిచింది. ఈ విషాద సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. 

మహిళా ఆర్టిసి ఉద్యోగి ఆత్మహత్యతో ఖమ్మం జిల్లాలో విషాదం అలుముకుంది. తమ సహచర ఉద్యోగి ఇలా ప్రాణత్యాగానికి  పాల్పడంతో జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యప్తంగా  ఆర్టీసీ ఉద్యోగులు విచారం వ్యక్తం చేస్తున్నారు.  ఆమె మృతదేహాన్ని సందర్శించిన ఆర్టీసీ కార్మికుల ఖమ్మం రీజినల్ జేఏసీ గడ్డం లింగమూర్తి కుటుంబ సభ్యులను ఓదార్చేప్రయత్నం చేశారు. 

read more అనుమానాస్పద స్థితిలో ఆర్టీసీ డ్రైవర్ మృతి.. ఆత్మహత్య అంటూ..

ఆర్టీసి సమ్మె మొదలై దాదాపు  నెలరోజులే కావస్తోంది. అయినప్పటికి అటు ప్రభుత్వం గానీ, ఇటు కార్మిక సంఘాలు గానీ పట్టువిడుపును ప్రదర్శించకుండా మంకుపట్టును ప్రదర్శిస్తున్నాయి. దీంతో ఇప్పటికే గతనెల(అక్టోబర్) జీతాలు రాక కార్మికులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఇంకెంతకాలం ఈ సమ్మె కొనసాగుతుందో తెలీక మానసిక ఒత్తిడికి కూడా లోనవుతున్నారు. 

ఈ క్రమంలో శనివారం కార్మిక సంఘాలు,  ఆర్టీసీ యాజమాన్యానికి మధ్య చర్యలు జరిగాయి. దీంతో ఉద్యోగులు సమ్మె విరమణ వుంటుందని భావించారు. అయితే చర్చలు విఫలమవడంతో ఈ ఆందోళన కొనసాగుతుందని కార్మికుల సంఘాల నాయకులు ప్రకటించారు. దీంతో మళ్లీ కథ మొదటికొచ్చింది. 

read more  RTC Strike:పెట్రోల్ పోసుకుని ఆర్టిసి డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

ఇప్పటికే ఈ ఆర్టీసి సమ్మె కారణంగా పలువురు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ సంఘటనలను చూసికూడా ప్రభుత్వం, కార్మిక సంఘాలు తమకేమీ పట్టనట్టుగా వ్యవవహరించాయి. దీంతో సమ్మె కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే మరో మహిళా కార్మికురాలి ఆత్మహత్య చోటుచేసుకుంది.

 ఇటీవలే కరీంనగర్ ఆర్టిసి డిపో వద్ద  నిరసన చేపడుతున్న కార్మికుల్లో జంపన్న అనే డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అందరూ చూస్తుండగానే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా అప్రమత్తమైన సహచరులు అతన్ని అడ్డుకున్నారు. దీంతో ప్రమాదం తప్పింది. 

ఒక్కసారిగా జంపన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో అక్కడే వున్న పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

అలాగే నార్కట్‌పల్లి డిపో డ్రైవర్‌ వెంకటేశ్వర్లు ఇటీవలే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయనది ఆత్మహత్యేనని పోలీసులు తేల్చారు. ఘటనాస్థలంలో లభించిన సూసైడ్‌ లెటర్‌ను ఆధారంగా అతడిది ఆత్మహత్యేనని తేలింది.