Asianet News TeluguAsianet News Telugu

అనుమానాస్పద స్థితిలో ఆర్టీసీ డ్రైవర్ మృతి.. ఆత్మహత్య అంటూ..

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించి.. ఘటనాస్థలంలో సూసైడ్‌ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే సూసైడ్ లెటర్‌పై పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. దీంతో... పోలీసులు చెబుతున్నది నిజమా లేదా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

RTC Driver committed suicide in narkatpally over RTC Strike
Author
Hyderabad, First Published Oct 26, 2019, 10:37 AM IST

మరో ఆర్టీసీ డ్రైవర్ ప్రాణాలు వదిలాడు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఇప్పటికే ఇద్దరు డ్రైవర్లు, ఓ కండక్టర్ ప్రాణాలు కోల్పోగా.. తాజాగా... మరో డ్రైవర్ తుది శ్వాస వదిలాడు. ఈ సంఘటన  నల్గొండ జిల్లా నార్కట్ పల్లిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నార్కట్‌పల్లి డిపో డ్రైవర్‌ వెంకటేశ్వర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయనది ఆత్మహత్యేనని పోలీసులు తేల్చారు. లారీ అసోసియేషన్ కార్యాలయం దగ్గర ఆయన మృతదేహం పడి ఉండటాన్ని నేటి ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. 

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించి.. ఘటనాస్థలంలో సూసైడ్‌ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే సూసైడ్ లెటర్‌పై పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. దీంతో... పోలీసులు చెబుతున్నది నిజమా లేదా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

ఇదిలా ఉంటే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం నియమించిన ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ సాధ్య అసాధ్యాలపై చర్చిస్తోంది. ఆర్టీసీ కార్మికులు కోరుతున్న 26 డిమాండ్లపై కమిటీ నివేదికను తయారు చేసింది.  

AlsoReady RTC strike: ఆర్టీసీ ఖతమ్: ఆర్టీసీ సమ్మెపై తేల్చేసిన కేసీఆర్

ఆర్టీసీ కార్మికులు కోరుతున్న 21 డిమాండ్ల సాధ్యాసాధ్యాలపై రెండు నివేదికలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ మినహా ఇతర డిమాండ్లపై నివేదిక తయారు చేసినట్లు సమాచారం. 

ఇప్పటి వరకు రూపొందించిన నివేదికలలో అన్నింటిని మళ్లీ పరిశీలించి సమగ్ర వివరాలతో కూడిన ఫైనల్ నివేదికను కోర్టుకు అందించనుంది ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ. హైకోర్టు అడిగిన ప్రతి అంశానికి సంబంధించి రెండు రకాల సమాధానాలను అధికారులు సిద్ధం చేశారు. 

AlsoRead హైకోర్టు ఏమైనా కొడతదా..? : సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

అలాగే ఆర్టీసీకి అద్దె బస్సుల అవసరంపై కూడా అధికారులు ప్రత్యేక నివేదికను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నివేదికను సీఎం కేసీఆర్‌కు ఈడీల కమిటీ సమర్పించనుంది. అనంతరం ఈనెల 28న హైకోర్టు విచారణలో అందించనుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios