షాద్‌నగర్:  ఆర్టీసీ సమ్మెతో మనోవేదనకు గురైన ఆర్టీసీ డ్రైవర్ ఖాజా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నారు.

ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్ బస్సు డిపోలో ఖాజా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సమ్మె కారణంగా ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ వేతనాలు ఇవ్వలేదు. వేతనాల విషయమై ఆర్టీసీ కార్మికులు కోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై ఇవాళ కోర్టు విచారణ చేయనుంది.

RTC Strike: ఆర్టీసీ డ్రైవర్ మృతి... కరీంనగర్ బంద్ పై పోలీసుల ఉక్కుపాదం

జీతాలు లేకపోవడం, సమ్మె కారణంగా నెల రోజులుగా విధుల్లో లేకపోవడంతో ఆర్ధికంగా ఖాజా కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. దీంతో మనోవేదనకు గురైన డ్రైవర్ ఖాజా శుక్రవారం నాడు నాగర్‌కర్నూల్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

read more RTC Strike: 27వ రోజుకు ఆర్టీసీ సమ్మె, మరో డ్రైవర్ మృతి

ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని  వైద్యులు చెప్పారు.అక్టోబర్ 5వ తేదీన ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెను ప్రారంభించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై శుక్రవారం నాడు హైకోర్టులో విచారణ జరగనుంది. 

మరోవైపు వేతనాలు లేక ఇంటిల్లిపాదిలి ఇబ్బందిపడాల్సి వస్తోంది. నిన్న కరీంనగర్‌‌కు నంగునూరి బాబు అనే డ్రైవర్ చనిపోయిన సంగతి తెలిసిందే. గుండెపోటుతో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.గురువారం నాడు పాలమూరులో మరో డ్రైవర్ కృష్ణయ్యగౌడ్ చనిపోయారు.

మహబూబ్‌నగర్ డిపోకి చెందిన కృష్ణయ్య గౌడ్ గురువారం గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయాడు. వేతనం లేక అతని కుటుంబం ఇబ్బంది పడిందని ఆర్టీసీ నేతలు చెప్తున్నారు. 

కృష్ణయ్యది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని చెప్తున్నారు. కృష్ణయ్య 20 ఏళ్ల నుంచి ఆర్టీసీలో పనిచేస్తున్నారు. ఆయన స్వస్థలం బండమీదిపల్లి అని కార్మిక నేతలు తెలిపారు. ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం నాడు ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఖాజా అనే డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశాడు.