Asianet News TeluguAsianet News Telugu

RTC Strike: 27వ రోజుకు ఆర్టీసీ సమ్మె, మరో డ్రైవర్ మృతి

మరోవైపు వేతనాలు లేక ఇంటిల్లిపాదిలి ఇబ్బందిపడాల్సి వస్తోంది. నిన్న కరీంనగర్‌‌కు నంగునూరి బాబు అనే డ్రైవర్ చనిపోయిన సంగతి తెలిసిందే. గుండెపోటుతో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇవాళ పాలమూరులో మరో డ్రైవర్ కృష్ణయ్యగౌడ్ చనిపోయారు.


 

RTC Strike: driver krishnaiah goud died due to Heart attack in polamuru
Author
Mahabubnagar, First Published Oct 31, 2019, 4:30 PM IST

పోలమూరు: డిమాండ్లను తీర్చేందుకు ప్రభుత్వం ముందుకురాకపోవడం, జీతాలు చెల్లించకపోవడంతో ఆర్టీసీ కార్మికుల మనోవేదనకు గురవుతున్నారు. ఇటు మంత్రులు, సీఎం వ్యాఖ్యలతో మదనపడిపోతున్నారు. 

ఈ నెల 5న ప్రారంభమైన ఆర్టీసీ సమ్మె 27వ రోజుకు చేరగా.. 17 మంది కార్మికులు చనిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.

ప్రగతి రథ చక్రాల చోదకుల గుండె ఆగిపోతుంది. కొందరు కండక్టర్లు కూడా మృత్యువాత పడుతున్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో 27వ రోజులుగా సమ్మె చేస్తున్న.. ప్రభుత్వంలో చలనం రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 

మరోవైపు వేతనాలు లేక ఇంటిల్లిపాదిలి ఇబ్బందిపడాల్సి వస్తోంది. నిన్న కరీంనగర్‌‌కు నంగునూరి బాబు అనే డ్రైవర్ చనిపోయిన సంగతి తెలిసిందే. గుండెపోటుతో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇవాళ పాలమూరులో మరో డ్రైవర్ కృష్ణయ్యగౌడ్ చనిపోయారు.

మహబూబ్‌నగర్ డిపోకి చెందిన కృష్ణయ్య గౌడ్ గురువారం గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయాడు. వేతనం లేక అతని కుటుంబం ఇబ్బంది పడిందని ఆర్టీసీ నేతలు చెప్తున్నారు. 

కృష్ణయ్యది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని చెప్తున్నారు. కృష్ణయ్య 20 ఏళ్ల నుంచి ఆర్టీసీలో పనిచేస్తున్నారు. ఆయన స్వస్థలం బండమీదిపల్లి అని కార్మిక నేతలు తెలిపారు. ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

RTC Strike: 26వరోజుకు సమ్మె, ఆగిన మరో గుండె

Follow Us:
Download App:
  • android
  • ios