Asianet News TeluguAsianet News Telugu

సకల జనుల సమ్మె రికార్డుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మె

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాస్ట్ర సాధన కోసం సాగిన సకల జనుల సమ్మె రికార్డుకు ఆర్టీసీ కార్మికుల సమ్మె చేరుకొంది. 

RTC Strike reaches to sakala janula samme record  in telangana
Author
Hyderabad, First Published Nov 15, 2019, 11:58 AM IST

హైదరాబాద్: ఉమ్మడి ఆధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆర్టీసీ, సింగరేణి కార్మికులతో పాటు  తెలంగాణ ఎన్‌జీవోలు 42 రోజుల పాటు సమ్మె నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 42 రోజుల పాటు జరిగిన సమ్మె ఆర్టీసీ కార్మికులదే కావడం గమనార్హం.

also read:ఆర్టీసీ విలీనం ప్రస్తుతానికి వద్దు.. మిగిలిన డిమాండ్లు తేల్చండి: అశ్వత్థామరెడ్డి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో  ఆనాడు జేఎసీ పిలుపు మేరకు సకల జనుల సమ్మె నిర్వహించారు.  ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె కీలకమైన ఉద్యమం. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు  ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 42 రోజుల పాటు సమ్మె  చేశారు. ఈ సమ్మెలో ఆర్టీసీ, తెలంగాణ ఎన్‌జీవోలు, సింగరేణి కార్మికులు కీలకంగా ఉన్నారు.

Also Read:కేసీఆర్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ: రూట్ల ప్రైవేటీకరణపై స్టే

2011 సెప్టెంబర్ 13వ తేదీ నుండి ఆనాడు సకల జనుల సమ్మె ప్రారంభమైంది. సమ్మెలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు 42 రోజుల పాటు సమ్మె చేశారు. ఆ సమయంలో కూడ దసరా పర్వదినం వచ్చింది. 

ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుండి తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇవాళ్టికి 42వ రోజుకు చేరుకొంది.ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మెట్టు దిగడం లేదని  ఆర్టీసీ జేఎసీ నేతలు ఆరోపిస్తున్నారు.

Also Read:ఆర్టీసీ సమ్మె: సెప్టెంబర్ జీతాలపై హైకోర్టు విచారణ వాయిదా

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ విషయమై ఆర్టీసీ జేఎసీ నేతలు వెనక్కు తగ్గారు. ఈ డిమాండ్ మినహా ఇతర డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ జేఎసీ నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

ఆర్టీసీ కార్మికులు 42 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇంకా  కూడ సమ్మెను కొనసాగిస్తామని జేఎసీ నేతలు ప్రకటించారు. ఆర్టీసీ జేఎసీ నేతలు  ఈ నెల 18వ తేదీ వరకు తమ  నిరసన కార్యక్రమాన్ని ప్రకటించారు.

ఈ నెల 18వ తేదీన ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఆ రోజున హైకోర్టు ఏ రకమైన విచారణ చేయనుందోననే  విషయమై ఉత్కంఠ నెలకొంది. ఆర్టీసీ సమ్మెలోకి కార్మికులు వెళ్లినందున సెప్టెంబర్ మాసానికి చెందిన వేతనాలను ప్రభుత్వం చెల్లించలేదు. ఈ వేతనాల కోసం  కూడ ఆర్టీసీ కార్మికులు హైకోర్టును ఆశ్రయించారు.

సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల విషయంలో ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తోందో చూడాలి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై జేఎసీ నేతలు వెనక్కు తగ్గారు. తమ డిమాండ్ పై ఆర్టీసీ జేఎసీ నేతలు వెనక్కు తగ్గడంపై  ప్రభుత్వ స్పందన కోసం ఆర్టీసీ కార్మికులు చూస్తున్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios