ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ మాసానికి  జీతాలు చెల్లించే విషయమై దాఖలైన పిటిషన్‌ విషయమై  విచారణను ఈ నెల 19వ తేదీకి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది.


హైదరాబాద్: సెప్టెంబర్ మాసానికి చెందిన జీతాలు చెల్లింపు విషయమై ఆర్టీసీ కార్మికులు దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో విచారణ తర్వాత ఈ పిటిషన్‌ను విచారణ చేయనున్నట్టుగా తెలంగాణ హైకోర్టు ప్రకటించింది.ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈ నెల 18వ తేదీన విచారణను ఈ నెల 13వ తేదీన వాయిదా వేసింది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఏ రకమైన తీర్పును ఇవ్వనుందనే విషయమై స్పష్టత రానుంది.

AlsoRead RTC Strike : మహబూబాబాద్ డిపో వద్ద ఉద్రిక్త పరిస్థితులు...

సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించాలని ఇదివరకే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఆర్టీసీ కార్మికులకు వేతనాలు చెల్లించేందుకు ఆర్టీసీ వద్ద అంత డబ్బు లేదని గతంలోనే కోర్టుకు ప్రభుత్వం తేల్చి చెప్పింది.

ఈ విషయమై కార్మికులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సాగుతోంది. అయితే ఈ పిటిషన్‌పై గురువారం నాడు విచారణ చేసిన హైకోర్టు విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.

ఆర్టీసీ సమ్మెకు సంబంధించి విచారణను ఈ నెల 18వ తేదీన హైకోర్టు విచారణ చేయనుంది. ఈ విచారణ తర్వాతే సెప్టెంబర్ నెల జీతాలపై హైకోర్టు విచారణ చేయనున్నట్టుగా ప్రకటించింది.

ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలను చెల్లించాలని కోరుతూ ఈ ఏడాది అక్టోబర్ 16వ తేదీన హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం మాత్రం జీతాలు చెల్లించలేదు. తమ డిమాండ్ల సాధన కోసం ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు.ఈ సమ్మె విషయంలో ప్రభుత్వం,ఆర్టీసీ కార్మికులు మెట్టు దిగడం లేదు.

ఆర్టీసీ కార్మికులు తమ సమ్మెను మరింత ఉధృతం చేస్తున్నారు.ఈ మేరకు ఆర్టీసీ ఈ నెల 18వ తేదీ వరకు కార్మికులు తమ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఈ నెల 18వ తేదీన సడక్ బంద్ ను నిర్వహించనున్నారు.