Asianet News TeluguAsianet News Telugu

సమ్మెపై కేసీఆర్ మాస్టర్ మైండ్: ఆయనను గైడ్ చేస్తోంది ఆ ఇద్దరే! ఇంతకీ ఎవరు వారు..

ఆర్టీసీ కార్మికుల సమ్మెపట్ల సీఎం కేసీఆర్ వ్యూహం వెనుక ఇద్దరు ఐఏఎస్ అధికారి కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నా కేసీఆర్ ను ముందు ఉండి నడిపిస్తున్నది వారిద్దరేనని తెలుస్తోంది. 
 

RTC Strike: KCR mastermind,two ias officers direct to cm KCR
Author
Hyderabad, First Published Nov 28, 2019, 3:06 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన ఉద్యమాన్ని సీఎం కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంకోసం పోరాటం చేసి, ఉద్యమ కారుడు నుంచి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కు ఆర్టీసీ కార్మికుల బాధలు కనిపించడం లేదా....?ప్రతిపక్షాలన్నీ ఆర్టీసీ కార్మికులతో కలిసి ఉద్యమం చేస్తున్నా కేసీఆర్ లో ఎందుకు కదలికలేదు. 

తన మాట విననందుకు ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారా....? సమ్మెకు వెళ్లొద్దని హెచ్చరించిన కేసీఆర్ ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఎలా ముందే చెప్పారు. కోర్టులు సైతం కేసీఆర్ వాదనలకే మెగ్గు చూపడం వెనుక ఆంతర్యం ఏంటి....? 

అసలు కేసీఆర్ ను నడిపిస్తోంది ఎవరు..ఇతర రాష్ట్రాల్లో ఆర్టీసీ పనితీరును పరిశీలించిన ఆ ఇద్దరు ఐఏఎస్ లు ఎవరు...ఉద్యమం నుంచి కేసీఆర్ ను సేవ్ చేస్తున్న ఆ సేవియర్స్ ఎవరో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.  

ఉద్యమం చేస్తేనే గాని భారతదేశానికి స్వాతంత్ర్యం రాలేదు. తిరుగుబాటు చేస్తేనేగానీ తెల్లదొరలు భారతదేశాన్ని వదిలిపోలేదు. పోరాటం చేస్తేనేగానీ తెలంగాణ సాధన సాధ్యం కాలేదు. ఉద్యమాలు ఎన్ని ఉన్నా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ తలపెట్టిన ఉద్యమం ఇప్పటికీ ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గల్లీ నుంచి మెుదలు పెట్టిన ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లారు. 

ఉద్యమం అంటే ఇలా ఉంటుందని చూపిస్తూ ఆ నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచడంలో సక్సెస్ అయ్యారు కేసీఆర్. అందువల్లే తెలంగాణ ముఖ్యమంత్రిగా కంటే కేసీఆర్ ను ఒక ఉద్యమ నాయకుడిగా ప్రజలు గౌరవిస్తూ ఉంటారు. 

Also read: ఆర్టీసీ సమస్యకు విఆర్ఎస్... అదనపు భారం ఎంతో తెలుసా...?

ఉద్యమం నుంచి ఉవ్వెత్తున కెరటంలా ఎగిసిపడిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆయనకే పట్టం కట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించారు. ఒకసారి కాదు రెండోసారి కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కే పట్టం కట్టారు. 

అయితే తెలంగాణ రాష్ట్రంలో తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన ఉద్యమాన్ని ఒక ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. 

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తలపెట్టిన ఉద్యమంలో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచిన కేసీఆర్ స్వరాష్ట్రంలో స్వరాష్ట్ర ఆర్టీసీ కార్మికులు ఉద్యమం చేస్తుంటే ఎందుకు గుర్తించలేకపోతున్నారు అనేది ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. 

ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి ఇతర రాజకీయ పార్టీలన్నీ బలంగా మద్దతు పలుకుతున్నా కేసీఆర్ లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఏ పిలుపులతో అయితే ఉద్యమాన్ని హీటెక్కించారో అలాంటి ఉద్యమాలకే పిలుపు ఇస్తున్నా కేసీఆర్ లో మార్పు మాత్రం రావడం లేదు. 

ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని సీఎం కేసీఆర్ రిక్వస్ట్ చేశారు. ఉద్యమంలోకి వెళ్తే ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరించారు. అంతేకాదు యూనియన్ నాయకుల రాజకీయాలకు బలవ్వద్దని కార్మికులకు సూచించారు. కేసీఆర్ వినతిని పెడచెవిన పెట్టిన కార్మికులు సమ్మెకు వెళ్లారు. 

Also read: ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ నిర్ణయం ఇదే: తేలనున్న కార్మికుల భవితవ్యం

సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చాలా దురుసుగానే ప్రవర్తించారని చెప్పాలి. రాష్ట్రముఖ్యమంత్రిని పట్టుకుని ఇష్టం వచ్చిన రీతిలో తిట్టని తిట్లు కూడా తిట్టారు. దాంతో కేసీఆర్ భీష్మించుకు కూర్చున్నారు. 

అయితే తాను ఎందుకు ఆర్టీసీ కార్మికులను సమ్మెకు వెళ్లొద్దాన్నానో అన్న అంశాలపై కేసీఆర్ వివరణ ఇచ్చారు. ఉద్యోగులు విధుల్లోచేరాలని కూడా నిర్ణయించారు. అయినప్పటికీ వారిలో మార్పు రాలేదు. కానీ కేసీఆర్ లో మార్పు రావాలని వారు కోరుకుంటున్నారు. 

ఇలాంటి తరుణంలో ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా కేసీఆర్ వ్యూహాన్ని రచిస్తున్నారు. ఇప్పటికే బస్సు రూట్లను ప్రైవేటీకరణ చేసిన కేసీఆర్ అందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తున్నారు కేసీఆర్. 

ఆర్టీసీ కార్మికుల సమ్మెపట్ల సీఎం కేసీఆర్ వ్యూహం వెనుక ఇద్దరు ఐఏఎస్ అధికారి కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నా కేసీఆర్ ను ముందు ఉండి నడిపిస్తున్నది వారిద్దరేనని తెలుస్తోంది. 

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో ఆర్టీసీ పట్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేయాలని ఇద్దరు ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించారట సీఎం కేసీఆర్. 

ఆ ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఇప్పుడూ కేసీఆర్ ను ముందు ఉండి నడిపిస్తున్నారని తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మెకు వెళ్లడం వల్ల ప్రయోజనం లేదని కేసీఆర్ స్వయంగా హెచ్చరించారు. యూనియన్ నేతల మాయలో పడొద్దని కూడా సూచించారు. ఇదే అంశాలను కూడా హైకోర్టు ప్రస్తావించింది. 

హైకోర్టు తమ ప్రభుత్వాన్ని ఏమైనా కొడతాదా అంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. మానవత్వంతో ఆలోచించాలని రిక్వస్ట్ చేస్తుంది లేకపోతే లేబర్ కోర్టుకు రిఫర్ చేస్తోంది ఇలాగే ఒక ప్రెస్మీట్లో చెప్పారు కేసీఆర్. అన్నట్లుగానే అలాగే జరిగింది. 

ఆర్టీసీ బస్సు రూట్లను ప్రైవేటీకరణ చేస్తామని ఆనాడే చెప్పారు. దానికి కోర్టు నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఉండవని కేసీఆర్ ఆనాడే తెగేసి చెప్పారు. అదే అంశాలను హైకోర్టు కూడా చెప్పింది. బస్సు రూట్ల ప్రైవేటీకరణను స్వాగతించింది. 

న్యాయపరంగా, ఉద్యమ పరంగా ఎదురయ్యే అంశాలను ముందుగానే పసిగడుతున్న ఆ ఇద్దరు ఐఏఎస్ అధికారులు కేసీఆర్ కు ముందే తెలియజేసి ఆ తర్వాత పరిణామాలను కూడా వివరిస్తున్నారట. దాంతో కేసీఆర్ ఆర్టీసీ ఉద్యమంలో పై చేయి సాధిస్తూనే ఉన్నారని తెలుస్తోంది. అయితే ఆ ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఎవరా అన్న అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios