హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో  ఆర్టీసీ జేఎసీ నేతలు సోమవారం నాడు ఐదు గంటలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలవనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను గవర్నర్‌ను  వివరించనున్నారు. హైకోర్టు తీర్పును కూడ ప్రభుత్వం స్పందించకపోవడంపై  గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు.

Related article

RTC strike: గుండెపోటుతో కుప్పకూలిన ఆర్టీసీ డ్రైవర్..పరిస్థితి విషమం

ఈ నెల 5వ తేదీ నుండి ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ స్వంతంగా ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది.

మరో వైపు ఇవాళ్టి నుండి ఈ నెల 30వ తేదీ వరకు ఆర్టీసీ జేఎసీ, పలు రాజకీయపార్టీలు పలు కార్యక్రమాలను చేపట్టాయి.ఈ నెల 30వ తేదీన సకల జనుల సమరభేరిని నిర్వహించనున్నారు.సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో చర్చించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఈ విషయమై ప్రభుత్వం నుండి ఇంకా ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. 

Related article

tsrtc strike: గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి

ఆర్టీసీ కార్మికులతో  చర్చించాలని  ఈ నెల 18వ తేదీన తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 19వ తేదీ ఉదయం పదిన్నర గంటలకు ఆర్టీసీ కార్మికులతో చర్చించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అయితే తెలంగాణ ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం ఇంతవరకు చర్చించలేదు. హైకోర్టు కాపీ అందలేదనే నెపంతో ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చించలేదు. ప్రభుత్వం నుండి చర్చల కోసం పిలుపు వస్తోందని ఆర్టీసీ జేఎసీ నేతలు ఎదురుచూస్తున్నారు.

కానీ ప్రభుత్వం నుండి  ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆర్టీసీ జేఎసీ నేతలు సోమవారం నాడు సాయంత్రం మరోసారి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలవాలని నిర్ణయం తీసుకొన్నారు.ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్  అపాయింట్ మెంట్ లభించింది.

Related article

హెచ్‌సీయూ డిపోలో కండక్టర్ ఆత్మహత్యాయత్నం: పరిస్థితి విషమం

రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై ఆర్టీసీ కార్మికులు గవర్నర్ కు సమాచారం ఇవ్వనున్నారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించిందనే విషయాలపై గవర్నర్ కు జేఎసీ నేతలు వివరించనున్నారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఈ నెల 30వ తేదీ వరకు పలు నిరసన కార్యక్రమాలను ఆర్టీసీ జేఎసీ, రాజకీయ పార్టీలు ప్రకటించాయి. 

ఆర్టీీసీ సమ్మెకు మద్దతుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోమవారం నాడు ప్రగి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ నేతలను  ముందస్తుగానే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డిలు పోలీసుల కళ్లుగప్పి ప్రగతి భవన్ వద్దకు వచ్చారు. పోలీసులు వారిని ప్రగతి భవన్ వద్ద అరెస్ట్ చేశారు. 

ఆర్టీసీ కార్మికుల జేఎసీ నేతల ఫిర్యాదుపై తమిళిపై ఏ రకంగా స్పందిస్తోందోననేది ఆసక్తి నెలకొంది.ఈ నెల 17వ తేదీన ఆర్టీసీ సమ్మె విషయమై తమిళిసై రవాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడారు.  రవాణా శాఖ కార్యదర్శి సునీల్ శర్మ కూడ గవర్నర్ తో సమావేశమై ఆర్టీసీ సమ్మె విషయమై ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను అదే రోజున వివరించిన విషయం తెలిసిందే.