వరంగల్: విధుల్లో చేరేందుకు వెళ్లిన ఆర్టీసీ కార్మికులను ఆయా ఆర్టీసీ డిపో మేనేజర్లు తిప్పి పంపుతున్నారు. విధుల్లో చేర్చుకోవాలని  తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

Also read:సమ్మె విరమణకు అశ్వత్థామరెడ్డి ఆఫర్: సాయంత్రం కేసీఆర్ సమీక్ష

షరతులు లేకుండా ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేర్చుకోవాలని  ఆర్టీసీ జేఎసీ కన్వీనర్  ఆశ్వత్థామరెడ్డి బుధవారం నాడు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కోరిక మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.  

Also read:ఆర్టీసీ సమ్మెకు బ్రేకులు:నిర్ణయం కేసీఆర్ చేతుల్లోనే....

అయితే విధుల్లోకి చేరేందుకు ఆర్టీసీ కార్మికులు బస్ డిపోల వద్దకు వెళ్తున్నారు. అయితే విధుల్లో చేరేందుకు ఆర్టీసీ డిపోల వద్దకు వెళ్లే కార్మికులను డిపో మేనేజర్లు తిప్పి పంపుతున్నారు.  గురువారం పరకాలలో డ్రైవర్లు సంపత్‌, రత్నం విధుల్లోకి చేరేందుకు వెళ్లారు. అయితే వారిద్దరిని విధుల్లోకి తీసుకోకుండా డిపో మేనేజర్లు తిప్పి పంపారు.

Also read:కేసీఆర్ కు పవన్ కళ్యాణ్ మరో రిక్వస్ట్: సానుభూతి చూపించండి

సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వేతనాలు లేకపోవడంతో ఆర్టీసీ కార్మికులు కొందరు మనోవేదనకు గురై  ఆసుపత్రి పాలయ్యారు. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

ఆర్టీసీ సమ్మెను రెండు వారాల్లో పరిష్కరించాలని  లేబర్ కోర్టును తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయితే లేబర్ కోర్టులో రెండు వారాల్లో ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందా అనే  కోణంలో కూడ జేఎసీ నేతలు న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత భేషరతుగా తమను విధుల్లోకి తీసుకోవాలని  ప్రకటించినట్టుగా సమాచారం.

ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుండి  ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో  హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ జేఎసీ నేతలు సానుకూలంగా ఉన్నారు. 

ఆర్టీసీ జేఎసీ కూడ సమ్మె విషయంలో తర్జన భర్జన పడుతోంది.  జేఎసీ నేతలు చేసిన ప్రకటనపై ఏం చేయాలనే దానిపై కూడ తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నాడు సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.ప్రభుత్వం తీసుకొనే నిర్ణయం ఆధారంగా ఆర్టీసీ జేఎసీ నేతలు భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు.