సంఘ్ కార్యకర్తలు స్వార్థం గురించి ఆలోచించరన్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్సెస్) చీఫ్ మోహన్ భగవత్. హైదరాబాద్ సరూర్‌నగర్‌లో విజయ సంకల్ప బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ధర్మం గెలిచినప్పుడు మాత్రమే నిజమైన విజయమని.. ప్రపంచ విజయాన్ని కోరుకునేవారే సంఘ్ కార్యకర్తలని ఆయన వెల్లడించారు. దేశ విజయం కోసం చేస్తున్న సంకల్పంగా హైదరాబాద్ సభను భగవత్ అభివర్ణించారు.

కొందరు స్వార్థం కోసం విద్వేషాలను రెచ్చగొట్టి పైకి వస్తారని.. అలాంటి వారు దేశానికి ప్రమాదకరమని మోహన్ భగవత్ హెచ్చరించారు. తమకు రాజ్యం అవసరం లేదని, వైభోగాలు అక్కర్లేదని, మోక్షం కూడా అవసరం లేదని భారతీయ నాగరికతే ముఖ్యమని మోహన్ భగవత్ స్పష్టం చేశారు.

సంఘ్.. హిందూ సమాజం, భారతావణి ధర్మమే కోరుకుంటుందని ఆయన తెలిపారు. సమాజంలో పరివర్తన వస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. 

Read Also:

భావసారూప్యత గల పార్టీలతో కలిసి పోరాటం: సీఏఏ, ఎన్ఆర్‌సీపై అసద్

మాట నిలబెట్టుకున్న కేసీఆర్: ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు