హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ తాత్కాలిక సచివాలయానికి వచ్చే అవకాశం ఉంది. కొత్త సంవత్సరంలో బూర్గుల రామకృష్ణారావు భవనంలో  (తెలంగాణ తాత్కాలిక సచివాలయ భవనం) తాత్కాలిక పెంట్ హౌస్‌ను నిర్మిస్తున్నారు. 

Alsor read:సమత గ్యాంగ్ రేప్, హత్య: 44 మంది సాక్షుల విచారణ, ఛార్జీషీట్ ఇదీ...

రాష్ట్ర ప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు భవనంలో 600 స్వ్కేర్ మీటర్లలో మూడు కోట్లతో  భవనాన్ని నిర్మిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు.

కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. అయితే కొత్త సచివాలయ నిర్మాణం విషయంలో కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కొత్త సచివాలయ నిర్మాణం తాత్కాలికంగా వాయిదా పడింది.

also read:దిశ నిందితుల ఎన్ కౌంటర్: మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు...

అధికారులతో సమీక్ష సమావేశాల కోసం తెలంగాణ సీఎం కేసీఆర్  బూర్గుల రామకృష్ణారావు భవనాన్ని సందర్శించాలని 
భావిస్తున్నారు. 

అయితే సీఎం బూర్గుల రామకృష్ణారావు భవనాన్ని సీఎం కేసీఆర్ సందర్శించిన సమయంలో  ఆయన అధికారులతో సమీక్ష చేసేందుకు అనువుగా ఛాంబర్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు.

ఈ మేరకు బూర్గుల రామకృష్ణారావు భవనంలో  కేసీఆర్‌కు ఛాంబర్‌ను ఏర్పాటు చేయాలని తలపెట్టారు. బూర్గుల రామకృష్ణారావు భవనంలో తనకు చాంబర్ నిర్మించాలని తెలంగాణ ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాస్టక్చర్ కార్పోరేషన్ ను కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం.

సుమారు 300 మందితో సీఎం కేసీఆర్ ఒకేచోట సమావేశం నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు వీఐపీలతో కలిసి కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు మరో మినీ కాన్పరెన్స్ హాల్‌ ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

 ప్రస్తుతం ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవనం నిర్మాణం పటిష్టతను జేఎన్‌టీయూ అధికారులు గుర్తించిన తర్వాత  ఈ భవనాన్ని నిర్మించనున్నారని అధికారులు తెలిపారు.

ఈ భవనం హుస్సేన్ సాగర్‌ పక్కనే ఉంది. దీంతో 180 కి.మీ. వేగంతో గాలులు వీచిన కూడ తట్టుకొనే అవకాశం ఉండేలా నిర్మాణం చేపట్టినట్టుగా సమాచారం.

వాస్తవానికి ఈ భవనాన్ని 2020 మార్చిలో పూర్తి చేయాలని భావించారు. కానీ, తర్వాత జనవరి నెలాఖరు వరకు ఈ భవన నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.